Bandi Sanjay : బండి సంజయ్ కి కీలక బాధ్యతలు అప్పగించిన బిజెపి అధిష్టానం

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 10:56 AM IST

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections ) నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay)కు బీజేపీ అధిష్ఠానవర్గం కీలక పదవి కట్టబెట్టింది. యువమోర్చా ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్, కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జి (Kisan Morcha In Charge)గా బండి సంజయ్ కుమార్‌లను పార్టీ అధిష్ఠానం నియమిచింది. ఇక ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జిగా తరుణ్ చుగ్, మహిళా మోర్చా ఇన్‌ఛార్జిగా బైజ్యంత్ జే పాండా, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జిగా డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, ఓబీసీ మోర్చా ఇన్‌ఛార్జిగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్‌ఛార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్‌ పేర్లను పార్టీ బుధవారం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ సంస్థాగత విభాగాలను పునర్‌వ్యవస్థీకరించింది. బుధవారం కీలక విభాగాలకు కొత్త ఇన్‌ఛార్జులను నియమించింది. ఇందులో పార్టీ సీనియర్లుకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ప్రకటన చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రకటించారు. అయితే అనుహ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. దీంతో సంజయ్ అసంతృప్తికి గురికాగా.. ఆయన్ను కేంద్రమంత్రి పదవి వస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆయన మంత్రి పదవి ఇవ్వకుండా.. పార్టీలో కేంద్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించినతంగా ఫలితాలు రాలేదు. ఆ పార్టీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఎమ్మెల్యేలుగా సంజయ్‌తో పాటు కీలక నేతలు ఓడిపోయారు. సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించటంతోనే.. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనే వాదన తెరపైకి వచ్చింది. సంజయ్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లి ఉంటే.. కనీసం 30 స్థానాల్లో బీజేపీ గెలిచి ఉండేదని అప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ అయి ఉండేవారని కొందరు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దీనిని పరిగణలోకి తీసుకున్న బిజెపి అధిష్టానం..బండి సంజయ్ కి కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు.

Read Also : Petrol Price Reduction : వాహనదారుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం