Site icon HashtagU Telugu

IIIT Basara: మరోసారి భగ్గమంటోన్న బాసర ట్రిపుల్ ఐటీ…!!

Basara

Basara

బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి భగ్గుమంటోంది. విద్యార్థుల డిమాండ్ల సాధనకోసం ఇదివరకే తీవ్రస్థాయిలో ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా విద్యార్థులు సెల్ ఫోన్లు వినియోగించడంపై అధికారులు నిషేధం విధించారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని తరగతి గదులు, అకాడమిక్ బ్లాక్స్, అడ్మినిస్ట్రేషన్ భవనాల్లో సెల్ ఫోన్లు వినియోగించరాదంటూ ఇంచార్చీ వీసీ వెంకటరమణ ఆదేశాలు జారీ చేశారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

సెల్ ఫోన్ వినియోగంపై నిషేధించడం పట్ల స్టూడెంట్స్ భగ్గుమంటున్నారు. విద్యార్థులు తమ ఉద్యమాన్ని డిమాండ్లను అణచివేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టూడెంట్ గవర్నెన్స్ కౌన్సిల్ మండిపడింది.