Site icon HashtagU Telugu

Venkat Balmoor : సీఎం రేవంత్ ఫోటో పై బాల్క సుమన్ వ్యాఖ్యలకు బల్మూరి వెంకట్ కౌంటర్

Balka Venkat

Balka Venkat

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ (Venkat Balmoor) కౌంటర్ ఇచ్చారు. సుమన్ తన ట్విట్టర్ ఖాతాలో సీఎం రేవంత్ ఫోటో పై ఘాటుగా స్పందించారు. సాక్షాత్తు శాసనమండలి ఛాంబర్ లో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రముఖ సామాజిక వేత్త, మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే చిత్రపటాల సరసన రేవంత్ రెడ్డి ఫోటో ఉండడం ఫై మహనీయులను అవమానించడమే అని సుమన్ పేర్కొన్నాడు. దీనిపై బలమూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఫోటో అక్కడే ఉంది. అప్పుడు కళ్ళు మూసుకు పోయాయా? ప్రతి దానికి అనవసరపు రాద్ధాంతం! జనాలు MLA, MP ఎన్నికల్లో బుద్ధి చెప్పిన ఇంకా పద్ధతి మారక పోతే ఎవరూ ఏం చేయగలరు. మిమ్ముల్ని మీరే బొంద పెట్టుకుంటా అంటే ఎవరు వద్దంటారు. తెలంగాణ కు ఇన్నాళ్లు పట్టిన భ్రష్టు వదులుతుంది అంటే తెలంగాణా ప్రజానీకానికి అంతకు మించి ఏం కావాలి అంటూ వెంకట్ కౌంటర్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతకు ముందు టీఎస్ కు బదులు టీజీగా మార్చినందుకు వేలకోట్లు ఖర్చు అవుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు పేపర్లు, జీవో కాపీలు తయారు చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ అన్నారు. టీఎస్ నుండి టీజీగా మార్చినందుకు 4,630 కోట్లు ఖర్చు అవుతుందని ప్రచారం చేస్తున్నారు . దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా, డీజీపీ వద్ద తేల్చుకుందాం రండి అంటూ బీఆర్ఎస్ నేతలకు వెంకట్ సవాల్ విసిరారు. ప్రధాన ప్రతిపక్ష నేతలు ప్రజలకు వాస్తవాలు చెప్పండి.. తప్పులు కాదు. ప్రజాదర్భార్ ఉంది.. ఏదైనాఉంటే అక్కడికి వచ్చి చెప్పొచ్చు అని తెలిపారు.

Read Also : CBN : ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు..ఐదు కీలక హామీలపై సంతకాలు