Vivek : ఆస్తులు కాపాడుకోవడానికే వివేక్ పెద్దపల్లిని ఉపయోగించుకుంటున్నారు – బాల్క సుమన్

వివేక్‌ కుటుంబం పెద్దపల్లిలో సామ్రాజ్యవాద విస్తరణకు కుట్ర చేస్తుందని బాల్క సుమన్‌ ఆరోపించారు

Published By: HashtagU Telugu Desk
Balka Vivek

Balka Vivek

పెద్దపల్లిలో వివేక్‌ వెంకటస్వామి (Vivek Venkataswamy) కుట్రలు పన్నుతున్నారని..ఆస్తులు కాపాడుకోవడానికే వివేక్ పెద్దపల్లిని ఉపయోగించుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ (Balka Suman). గోదావరిఖనిలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో కొప్పుల ఈశ్వర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా సుమన్ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను మరిచిపోయిందని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హామీలపై ప్రశ్నిస్తోన్న ప్రతిపక్షాల మీద కాంగ్రెస్‌ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక్‌ కుటుంబం పెద్దపల్లిలో సామ్రాజ్యవాద విస్తరణకు కుట్ర చేస్తుందని బాల్క సుమన్‌ ఆరోపించారు.

వ్యాపారాలు, పదవులు, ఆస్తులు కాపాడుకోవడానికి పెద్దపల్లిని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి వివేక్‌ వెంకటస్వామికి సామంత రాజ్యం కాదని మండిపడ్డారు. వేల కోట్ల ఆస్తులున్న వివేక్‌ దమ్ముంటే జనరల్‌ సీట్లలో పోటీ చేయాలని సవాలు విసిరారు. పెద్దపల్లి ప్రాంత దళిత సామాజిక వర్గాలను వివేక్‌ కుటుంబం అణగదొక్కుతుందని అన్నారు.

Read Also : Viveka Murder : ఐదేళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా జగన్ ..? – వివేకా కుమార్తె

  Last Updated: 28 Mar 2024, 07:05 PM IST