Site icon HashtagU Telugu

Balka Suman : నేను ఎక్కడికి పారిపోలేదు..హైదరాబాద్ లోనే ఉన్న – బాల్క సుమన్

Suman Police

Suman Police

తాను నేపాల్ పారిపోయాడనే వార్తలను బాల్క సుమన్ ఖండించారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను..ఉదయం నుండి బిఆర్ఎస్ భవన్ లొనే ఉన్నా..నాపై పెట్టిన కేస్ లకు సమాదానాలు ఇస్తాను..పోలీసులు విచారణ కు రమ్మంటే సహకరిస్తాను అని తెలిపారు మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.

We’re now on WhatsApp. Click to Join.

.సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) ఫై మంచిర్యాల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. ప్రస్తుతం పోలీసులు సుమన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా సుమన్ కోసం గాలింపు మొదలుపెట్టిన ఆయన జడ తెలియడం లేదు. ఈ క్రమంలో ఆయన నేపాల్ పారిపోయాడని..అక్కడే ఉన్నారని వార్తలు ప్రచారం మొదలయ్యాయి. దీంతో ఆ వార్తల ఫై సుమన్ క్లారిటీ ఇచ్చారు.

”నేను ఎక్కడికి పారిపోలేదు. హైదరాబాద్ లోనే ఉన్నాను..ఈరోజు ఉదయం నుండి తెలంగాణ భవన్ లో ఉన్నానని, నాపై పెట్టిన కేస్ లకు సమాదానాలు ఇస్తాను..పోలీసులు విచారణ కు రమ్మంటే సహకరిస్తాను…నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని క్లారిటీ ఇచ్చారు.

Read Also : AP : ఐదేళ్ల తర్వాత బయటకొచ్చిన కోడికత్తి శ్రీను..కొడుకును చూసి భావోద్వేగానికి గురైన తండ్రి