Site icon HashtagU Telugu

Balapur Laddu Highest Record: రికార్డు సృష్టించిన ‘బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ’

Balapur

Balapur

వినాయకుడి లడ్డూ అనగానే భాగ్యనగర వాసులందరికీ గుర్తుకువచ్చేది మొదట బాలాపూర్ లడ్డూనే. ఈ ఏడాది కూడా బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను రూ.24.60లక్షలకు దక్కించుకున్నారు. 1994 నుంచి బాలాపూర్‌లో గణేశ్ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. తొలుత రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట.. 2021లో రికార్డు స్థాయికి చేరి రూ.18.90 లక్షలు పలికింది. తాజాగా దాన్ని అధిగమించి ఏకంగా రూ.24.60లక్షలు పలకడం విశేషం.