Site icon HashtagU Telugu

Balapur Ganesh Laddu Auction : నేడు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. ఈ సారి కూడా రికార్డుస్థాయి ధ‌ర ప‌లికే ఛాన్స్‌

Balapur Ganesh Laddu Auction

Balapur Ganesh Laddu Auction

హైద‌రాబాద్‌లో గ‌ణేష్ నిమ‌జ్జ‌నం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయ‌త్ర ట్యాంక్‌బండ్ వైపు కొన‌సాగుతుంది. మ‌రికాసేప‌ట్లో బ‌డా గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం ముగియ‌నుంది. ఇటు గ‌ణేష్ ల‌డ్డూ వేలంలో చ‌రిత్ర సృష్టిస్తున్న బాలాపూర్ గ‌ణేష్ ల‌డ్డూ వేలంపై అంద‌రి దృష్టి ఉంది. ఈ ఏడాది ల‌డ్డూ వేలం పాట ఎంత ధ‌ర ప‌లుకుతుందో అని అంద‌రూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలాపూర్‌ గణేశుని లడ్డూ వేలం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. గణేశ్‌ ఉత్సవాల్లో బాలాపూర్‌ లడ్డూ వేలం పాటకు ఎంతో ప్రాధాన్యత ఉంది. డప్పు చప్పుళ్లు, తీన్మార్ డ్యాన్సుల‌తో బాలాపూర్‌ ప్రధాన వీధుల్లో గ‌ణ‌నాథుడిని ఊరేగిస్తున్నారు. అనంతరం బాలాపూర్‌ ముఖ్య కూడలైన బొడ్డురాయి వ‌ద్ద లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు . 1994 నుంచి బాలాపూర్‌ లడ్డూ వేలం పాట కొనసాగుతున్నది. నేటికి బాలాపూర్ ల‌డ్డూ వేలంపాట నిర్వ‌హించి 30 ఏళ్లు పూర్తికావొస్తుంది. అయితే కరోనా కారణంగా 2020లో లడ్డూ వేలం జరగలేదు. మొదటిసారిగా లడ్డూ వేలం రూ.450తో ప్రారంభమైంది. 2010 నాటికి రూ.10.32 లక్షలకు చేరింది. 2018లో శ్రీనివాస్‌ గుప్తా రూ.16.6 లక్షలకు లడ్డూని దక్కించుకున్నారు, 2019లో కొలన్‌ రాం రెడ్డి రూ.17.6 లక్షలకు, 2021లో మర్రి శశాంక్‌ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌ రూ.18.90 లక్షలు ప‌లికింది. గ‌త ఏడాది గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60 లక్షలకు గణేశుని లడ్డూ సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో ధ‌ర ప‌లికే అవ‌కాశం ఉన్న‌ట్లు ఉత్స‌వ క‌మిటీ స‌భ్యులు తెలిపారు.

Exit mobile version