Site icon HashtagU Telugu

Balapur Ganesh Laddu @ 27 Lakhs : బాలాపూర్ గణేష్ లడ్డు రూ. 27 లక్షలు పలికితే.. బండ్లగూడలో రూ. 1.20 కోట్లు పలికింది

Balapur laddu fetches a record Rs 27 lakh

Balapur laddu fetches a record Rs 27 lakh

నవరాత్రుల పాటు పూజలు అందుకున్న గణనాధుడు..ఇప్పుడు తల్లి గంగమ్మ ఒడిలోకి చేరుతున్నాడు. ఇక ఈ తొమ్మిది రోజులు వినాయకుడే కాదు..ఆయన చేతిలో లడ్డు కూడా పూజలు అందుకుంటుంది. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి ప్రసాదం అంటే భక్తులకు పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే వినాయకుడి కరుణ కటాక్షాలు లభిస్తాయని నమ్మకం.

అందుకే నవరాత్రులపాటు పూజలందుకున్న గణేశుడి చేతిలో ని లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతారు. నిమజ్జనం రోజు వేలం పాడి మరి చేజిక్కించుకుంటారు. వినాయకుడి లడ్డు వేలం పాట అంటే ప్రపంచ వ్యాప్తంగా అందరికి బాలాపూర్ లడ్డు వేలం గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రతి ఏడూ లక్షల్లో పెట్టి లడ్డును దక్కించుకుంటారు.

ఈసారి ఎంత పలుకుతుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉండగా..ఈ ఏడాది (2023 ) బాలాపూర్ లడ్డు ను దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షలకు దక్కించుకున్నారు. ఇది బాలాపూర్ లడ్డు వేలంలో రికార్డు ధర గా చెప్పాలి. గత ఏడాది రూ.24.60 లక్షల రికార్డు ధర పలికింది.పొంగులేటి లక్ష్మారెడ్డి గత ఏడాది లడ్డును దక్కించుకోగా ..ఈసారి దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షలకు దక్కించుకున్నారు.

2014 నుంచి బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్న వారి పేర్లు, పలికిన ధర వివరాలు చూస్తే..

2014- సింగిరెడ్డి జైహింద్ రెడ్డి – రూ.9.50 లక్షలు
2015- కళ్లెం మదన్ మోహన్ రెడ్డి – రూ.10.32 లక్షలు
2016- స్కైలాబ్ రెడ్డి – రూ.14.65 లక్షలు
2017- నాగం తిరుపతి రెడ్డి – రూ.15.60 లక్షలు
2018- శ్రీనివాస్ గుప్తా – రూ.16.60 లక్షలు
2019- కొలను రామిరెడ్డి – రూ.17.60 లక్షలు
2020 – కరోనా కారణంగా వేలం పాట జరగలేదు
2021 – మర్రి శశాంక్ రెడ్డి, రమేశ్ యాదవ్- రూ.18.90 లక్షలు
2022 -పొంగులేటి లక్ష్మారెడ్డి – రూ.24.60 లక్షలు

బాలాపూర్ లడ్డు వేలం ఈ ఏడాది రికార్డు ధర పలికితే..బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూ ఏకంగా రూ. 1.20 కోట్లు పలికింది. వేలంలో వచ్చిన మొత్తాన్ని ఛారిటీకే ఉపయోగిస్తానని చెబుతున్నారు లడ్డూను దక్కించుకున్న ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. గణపతి లడ్డూ ఇంత ధర పలకడం రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి. ఇక మాదాపూర్ మై హోమ్ భూజాలో కూడా గణపతి లడ్డూకు వేలంలో భారీ ధరనే సొంతం చేసుకుంది. ఇక్కడ లడ్డూ 25.50 లక్షలకు సొంతం చేసుకున్నారు అపార్ట్ మెంట్ వాసులు. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వినాయకుడి లడ్డూను సొంతం చేసుకున్నారు.

Read Also:  Manipur Violence: మణిపూర్ మంటలు చల్లారేదెపుడు..?

Exit mobile version