తెలంగాణ లో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే బిఆర్ఎస్ నేతలు నందమూరి తారకరామారావు (NTR) జపం చేస్తున్నారని , చంద్రబాబు అరెస్ట్ ను గత మూడు రోజులుగా ఖండిస్తూ వస్తున్నారని అన్నారు నందమూరి బాలకృష్ణ. బుధువారం ఎన్టీఆర్ భవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బాలకృష్ణ..చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ను అక్రమ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసారని , అరెస్ట్ తర్వాత పలు కేసులు పెట్టి మనోవేదనకు గురి చేస్తున్నారని బాలకృష్ణ తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) పై కొందరు వెంటనే స్పందించ లేదని పరోక్షంగా బీఆర్ఎస్ (BRS) పై బాలకృష్ణ విమర్శలు చేశారు. తెలంగాణ నేతలు చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించినా, ఎన్టీఆర్ జపం చేసినా ఎటువంటి లాభం లేదని బాలకృష్ణ అన్నారు. రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు లాంటివని అన్నారు. తెలంగాణ టీడీపీ పార్టీకి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేయడమే
జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబు అరెస్ట్‌పై సినీ పరిశ్రమ స్పందించకపోవడంపైనా బాలయ్య మాట్లాడారు. ఎవరు స్పందించినా స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అన్నారు. 17ఏ సెక్షన్ పాటించకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేశారు అనేదే మా ప్రశ్న. ఈ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదు. అనవసరంగా ఎవరిపైనా మేము నిందలు వేయం. కేంద్రం కల్పించుకోవాల్సిన అవసరం ఉన్న సమయంలో వారు మాట్లాడకపోవడం వారి విజ్ఞతకే వదిలేయాలి. రోజా లాంటి వారి స్పందనపై మౌనంగా ఉండటమే మంచిదని, బురద మీద రాయి వేస్తే తిరిగి మన మీదే పడుతుందని బాలకృష్ణ అన్నారు.
Read Also : Mansion 24 Trailer : భయపెట్టేందుకు వస్తున్న ఓంకార్ అన్నయ్య