CM Revanth Reddy: తెలంగాణలో కొత్త సర్కార్ కొలురుదీరనుంది. 65 సీట్లు గెలుచుకుని పూర్తి మెజార్టీతో సర్కారు ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్దమవుతుంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణకు కొత్త సీఎం ఎవరూ అన్న ఉత్కంఠకు తెరపడింది. నిన్నటి నుంచి ఇటు గాంధీ భవన్‌లో, అటు ఢిల్లీలో సీఎం అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు జరగగా.. టీపీసీసీ రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేశారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డికి హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చాలని మరియు అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపదంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి మీ పాలన మార్క్ తో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నానని తెలిపారు.
Also Read: Chitti Kakarakaya Vepudu: చిట్టికాకరకాయ వేపుడు.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..