Site icon HashtagU Telugu

Bairi Naresh : బైరి నరేష్‌ను అడ్డుకున్న అయ్యప్ప భక్తులు..ఎందుకంటే …!!

Bairi Naresh Hit The Ayyapp

Bairi Naresh Hit The Ayyapp

బైరి నరేష్‌ (Bairi Naresh)..ఇతడి గురించి చెప్పాలిన అవసరం లేదు..గతంలో అయ్యప్ప స్వామి (Ayyappa Swamy)పై, అయ్యప్ప స్వాములపై అనుచిత వ్యాఖ్యల చేసి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై హిందూ భక్తులు దాడి చేయడం కూడా జరిగింది. తాజాగా మరోసారి ఈయన వార్తల్లో నిలిచారు.

We’re now on WhatsApp. Click to Join.

ములుగు జిల్లా ఏటూరు నాగారంలో నాస్తిక సంఘం ఆధ్వర్యంలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అయ్యప్ప భక్తులు నాస్తికుడు నరేష్ ను అడ్డుకున్నారు. నరేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో నరేష్ వాహనం.. నరసింహారావు అనే భక్తుడిపైకి దూసుకెళ్లింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. నరేష్ వాహనం ఢీకొనడంతో ఆగ్రహించిన అయ్యప్పభక్తులు..జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. భైరి నరేష్‌ను అరెస్ట్ చెయ్యాలని అయ్యప్పభక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also : UPI Transaction Rules: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లకు అలెర్ట్.. నేటి నుంచి మారిన రూల్స్..!