Site icon HashtagU Telugu

Manne Krishank : బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు బెయిల్..

Krishank

Krishank

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌‌ (Manne Krishank)కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత వ్యవహారంలో ఫేక్ ప్రకటనను వైరల్ చేశారంటూ క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్ ఖైదీగా చంచల్ గూడా జైల్లో పెట్టగా.. శుక్రవారం రోజు నాంపల్లి కోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. క్రిశాంక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 25 వేల పూచీకత్తుతో పాటు 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా.. ప్రతిరోజూ పోలీసుల ముందు హాజరుకావాలని క్రిశాంక్‌ను నాంపల్లి కోర్టు ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బుధువారం మ‌న్నె క్రిశాంక్‌తో కేటీఆర్ చంచ‌ల్‌గూడ జైల్లో ములాఖ‌త్ అయ్యారు. మ‌న్నె క్రిశాంక్‌ను కలిసిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నిజానిజాలు తేల్చిన తర్వాత ఎవరు చంచల్ గూడ జైలులో కూర్చోవాలో కూడా తేలుద్దామన్నారు. క్రిశాంక్ పోస్టు చేసిన స‌ర్క్యుల‌ర్ త‌ప్పు కాదన్నారు. చేయ‌ని త‌ప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారు. రేవంత్ స‌ర్కార్ చేసిన వెధ‌వ ప‌నికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. క్రిశాంక్‌పై ఉద్దేశ‌పూర్వ‌కంగా కేసులు పెట్టి.. రేవంత్ రెడ్డి చిల్ల‌ర రాజ‌కీయం చేస్తున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.

Read Also : Modi’s Guarantee : నారాయణపేటలో ‘మోడీ గ్యారెంటీ’ల ప్రకటన..