Harish Rao : “ఓ మై హ‌రీశ్‌..” మూడో సీన్‌..!

టీఆర్ఎస్ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా హ‌రీశ్ రావుకు పేరుంది. ఇప్పుడు `ఓమైక్రిన్ ` క‌రోనా వేవ్ ను ఎదుర్కోవ‌డానికి సిద్ధం అవుతున్నాడు.

  • Written By:
  • Publish Date - November 29, 2021 / 01:41 PM IST

టీఆర్ఎస్ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా హ‌రీశ్ రావుకు పేరుంది. ఇప్పుడు `ఓమైక్రిన్ ` క‌రోనా వేవ్ ను ఎదుర్కోవ‌డానికి సిద్ధం అవుతున్నాడు. ఆ క్ర‌మంలో ఆయ‌న టాలెంట్ తో పాటు సెంటిమెంట్ మీద రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత తొలి వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా డాక్ట‌ర్ రాజ‌య్య ను నియ‌మించారు. స్వ‌త‌హాగా డాక్ట‌ర్ కావ‌డంతో పాటు ఎస్సీ వ‌ర్గానికి ప్రాధాన్య‌త‌ను కేసీఆర్ ఇచ్చాడు. ఆయ‌న హ‌యాంలో సీజన‌ల్ వ్యాధులు విజృంభ‌ణ చేశాయి. ప్ర‌ధానంగా డెగ్యూ ఫీవ‌ర్ తో చాలా మంది ఆస్ప‌త్రి పాల‌య్యారు. ఆ సంద‌ర్భంగా మంత్రి రాజ‌య్య ప‌నితీరుపైన అంద‌రి క‌ళ్లూ ప‌డ్డాయి. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న రాస‌లీల వ్య‌వ‌హారం బ‌య‌ట ప‌డింది. సీన్ క‌ట్ చేస్తే…మంత్రి ప‌ద‌వి పోయింది.

Also Read :  ధాన్యం కొనుగోళ్లపై చర్చకు TRS పట్టు..

రెండోసారి తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత వైద్య ఆరోగ్య‌శాఖ‌ను ఈటెల రాజేంద్ర‌కు అప్ప‌గించారు. ఆ ప‌ద‌విని చేప‌ట్టిన తొలి రోజుల్లోనే గులాబీ జెండాకు ఓన‌ర్లు ఎవ‌రు అంటూ స్లోగ‌న్ వినిపించాడు. ఆ రోజు నుంచి కేసీఆర్ టార్గెట్ లోకి రాజేంద్ర వెళ్లాడు. పైగా కేటీఆర్ కు ప్ర‌త్యామ్నాయంగా గ్రూప్ ను త‌యారు చేస్తున్నాడ‌ని ఆనాడు పార్టీలో బ‌లంగా వినిపించింది. అదే స‌మ‌యంలోనే కోవిడ్ 19 రెండో వేవ్ ముంచుకొచ్చింది. ఆయ‌న ప‌నితీరుపైన చాలా మంది క‌న్నేశారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నాడ‌ని సీఎం కేసీఆర్ కితాబు ఇచ్చాడు. వెంట‌నే..ఆయ‌న భూముల మీద విచార‌ణ‌కు కూడా ఆదేశించాడు. సీన్ క‌ట్ చేస్తే…మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పుకోవ‌డ‌మే కాదు..ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిన‌ ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Also Read :  వైసీపీలో “కోటంరెడ్డి” క‌ల‌క‌లం..జై అమ‌రావ‌తి నినాదం..!

ఇప్పుడు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా హ‌రీశ్ రావు ఉన్నాడు. మూడో వేవ్ రూపంలో వ‌స్తోన్న `ఓమైక్రిన్` మీద తొలి స‌మీక్ష‌ను నిర్వ‌హించాడు. మొద‌టి, రెండో వేవ్ లో జ‌రిగిన త‌ప్పులు పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించిన ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేశాడు. జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరాడు. ఒక వేళ రిపోర్టుల్లో నెగిటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు ఉన్న వాళ్లు హోం క్వారంటైన్ లో ఉండాల‌ని సూచించాడు. ఆర్థిక మంత్రిగా కూడా ఉన్న హ‌రీశ్ కు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న‌ప్ప‌టికీ హుజురాబాద్, దుబ్బాక ఎన్నిక‌ల్లో ఆయ‌న ఫార్ములా ప‌నిచేయ‌లేదు. ఇప్పుడు `ఓమైక్రిన్‌` పై ట్ర‌బుల్ షూట‌ర్ ఏమి చేస్తాడ‌నే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌పంచ‌లోని ప‌లు దేశాలు ఇప్ప‌టికే లాక్ డౌన్ దిశ‌గా వెళుతున్నాయి. ఆఫ్రికా, యూర‌ప్ దేశాల నుంచి హైద‌రాబాద్ కు ప‌లువురు ప్ర‌యాణాలు చేస్తుంటారు. వాళ్ల‌ను గుర్తించ‌డంలో ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం వ‌ద్ద ప్లాన్ లేదు. రెండో వేవ్ లో కూడా విదేశాల నుంచి వ‌చ్చే వాళ్ల‌ను గుర్తించ‌డంలో ప్ర‌భుత్వం వైఫ‌ల్యం చెందింది. అలాంటి వైఫ‌ల్యం మూడో వేవ్ లో చోటుచేసుకుంటే, భారీ న‌ష్టం ఉంటుంద‌ని డ‌బ్ల్యూహెచ్ వో చెబుతోంది. సో..మూడో వేవ్ త‌రువాత సీన్ క‌ట్ చేస్తే…ఏమ‌వుతుందో చూద్దాం.!