Wedding: బ్యాచిలర్స్‌కు బ్యాడ్ న్యూస్… పెళ్లి అవ్వాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే..!

మళ్లీ ఆగస్టు 8 తర్వాతే ...పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు.

  • Written By:
  • Updated On - April 27, 2024 / 05:47 PM IST

Wedding: పెళ్లి అనేది అందరి జీవితంలో ఎంతో అద్భుతమైన అనుభూతి. కానీ… మ్యారేజ్(marriage) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బ్యాచ్‌లర్స్‌కు (bachelors)  మాత్రం… ఈ వార్త నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది… త్వరలోనే పెళ్లి చేస్కుందామనుకునే యువతీ-యువకులకు పెళ్లి చేసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాలన చెప్తున్నారు.

అంటే… వివాహం చేసుకోవాలంటే ఇంకా మూడు నెలల వరకు… ఛాన్స్ లేదని పురోహితులు చెప్తున్నారు. మళ్లీ ఆగస్టు 8 తర్వాతే …పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఐతే… ఇప్పట్లో పెళ్లిళ్లకు, ఇంకా కొన్ని శుభకార్యాలకు కూడా బ్రేక్ పడిందనే చెప్పాలి. బ్యాచ్‌లర్స్ జీవితానికి… బాయ్ బాయ్ చెప్పాలంటే ఆగస్టు 8 వరకు ఆగాల్సిందేనని అంటున్నారు పురోహితులు. ఎందుకంటే.. ఇప్పుడు నేటితో మూఢం ప్రవేసించింది. మాఢం అంటే గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు.

ఐతే…గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యంగా…శుక్రగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. ఐతే… ఈ కాలాన్ని ఏవైనా మంచి పనులు ప్రారంభించడానికి అశుభంగా భావిస్తారు. అందుకే వాయిదా వేస్తుంటారు. ఈ సారి శుభకార్యాలు అశ్వాయుజ మాసంలో స్టార్ట్ అయ్యాయి. ఒక్క పుష్యమాసంలో తప్ప… మిగతా కార్తీకం, మాఘం, చైత్రమాసాల్లో… పెళ్లిళ్లు, ఇంకా ఇతర శుభకార్యాలు భేషుగ్గా జరిగాయి. కొన్ని సందర్భాల్లో అత్యవసరం అనుకునేవారు… వారికి కావాల్సిన అనుకూల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలకు వెసులుబాటు తీసుకున్నారు. ఐతే..ఈ నాలుగు నెలల్లో…తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20 వేల పెళ్లిళ్లు జరిగాయని పురోహితులు చెప్తున్నారు.

ఆ రోజుల్లో బ్రాహ్మణులు, ఇతర కులవృత్తుల వారు, బంగారు వ్యాపారులు, ఫంక్షన్‌హాళ్ల యజమానులు, ట్యాక్సీలు, వస్త్రవ్యాపారులు… ఇలా పలువర్గాల వారికి చేతినిండా పనే అని చెప్పాలి. ఎందుకంటే పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం ధర పెరుగుతున్నా కొనుగోలుదారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. పెళ్లి అంటే ఇక బంగారం కొనాల్సిందే. ఇక ఇవాళ్టి నుంచి (శనివారం 27) నుంచి ప్రారంభమయ్యే మూఢం ఆగస్టు 8 వరకు కొనసాగనుంది. ఇక ఈ మూడు నెల్లలో వివాహాలు, పెళ్లిచూపులు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాల జోలికి వెళ్లరు. వివాహం కావాలంటే మళ్లీ ఆగస్టు 8వ తేదీ వరకు ఆగాల్సిందే మరి.. అప్పటి దాకా వీటిపై ఆధారపడిన బ్యాండు, వాయిద్య కళాకారులు, అలంకార నిపుణులు, టెంట్ హౌస్‌ నిర్వాహకులు, పూల అమ్మకందారులు, క్యాటరింగ్‌ నిర్వాహకులు తదితరులు కాస్త విశ్రాంతి తీసుకోవాల్సిందే అని తెలుస్తుంది.