Site icon HashtagU Telugu

Mutton Chicken Shops : రేపు మటన్, చికెన్ షాపులన్నీ బంద్.. ఎందుకంటే ..?

Mutton Chicken Shops

Mutton Chicken Shops

Mutton Chicken Shops :  మాంసాహార ప్రియులకు బ్యాడ్ న్యూస్. ప్రతీ సండే రోజు మార్కెట్‌కు వెళ్లి మటన్, చికెన్ తెచ్చుకునే వారికి.. ఈ సండే రోజు మటన్, చికెన్ దొరకదు. ఎందుకంటే ఈ ఆదివారం రోజున  మటన్, చికెన్ షాపులు తెరుచుకోవు. ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం రోజు మాంసం విక్రయాలను బంద్ చేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఏప్రిల్ 21న (ఆదివారం రోజు) జైనుల మత గురువు మహావీర్ జయంతి ఉంది. జైనుల పండుగలలో  ఇది ముఖ్యమైనది. జైనులు పూర్తిగా మాంసాహారానికి దూరంగా ఉంటారు. జైనులకు సంఘీభావంగా నిలిచేందుకు, వారి మత విశ్వాసాలకు గౌరవించేందుకే ఈ ఆదివారం రోజు హైదరాబాద్‌లో మటన్, చికెన్ షాపులను బంద్ చేయించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది.

We’re now on WhatsApp. Click to Join

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మటన్ , చికెన్ షాపులతో పాటు కబేళాలు, మాంసం మార్కెట్లు అన్నీ బంద్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనల్  రొనాల్డ్ రాస్  ఆర్డర్స్ జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఎవరైనా బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల కారణంగా రేపు (సండే రోజు) సిటీలోని మటన్ షాపులన్నీ(Mutton Chicken Shops) జనం లేక వెలవెలబోతాయి.

Also Read :Avinash Reddy Assets : వైఎస్ అవినాశ్ రెడ్డి ఆస్తులు, అప్పుల వివరాలివీ..