Site icon HashtagU Telugu

KCR: ఈ ఏడాది కేసీఆర్‌కు తిరుగులేదు…సీఎం తీసుకునే సాహెసోపేత నిర్ణయం ఏమిటి..!!!

Kcr

Kcr

ఈ శుభకృత్ నామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి…పాలించే పాలకులకు..రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఎంతో అద్భుతంగా ఉంటుందని ఉగాది పంచంగంలో ఉన్నట్లుగా బాచుపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి సెలవిచ్చారు. సీఎం కేసీఆర్ ఈ ఏడాదిలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ఆయనకున్న చెడు కాలం ఫిబ్రవరితో తొలగిపోయిందని చెప్పారు. ప్రత్యర్థులు ఎన్నోఇబ్బందులు పెట్టినప్పటికీ…ఏ మాత్రం వెనక్కు తగ్గరని పంచాంగ పఠనంలో ఉన్నట్లు చెప్పారు. కేసీఆర్ ది కర్కాటక రాశి…సీఎం జాతకం గతేడాది కంటే బాగుంటుందని తెలిపారు.

హైదరాబాద్ నగరం ప్రపంచాన్ని శాసించే విధంగా ఎదుగుతుందన్నారు. మరీ ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ రంగం ఒక్క హైదరాబాద్ లోనే బాగా అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందన్నారు. ఇక కొంతమంది నాయకులు పదవి మార్పులు కలుగుతాయని…అందువల్ల పార్టీలు మారాలనుకునే వాళ్లకు గడ్డు కాలం తప్పదని పంచాంగ పఠనం ద్వారా హెచ్చరించారు. ఏడాది మొత్తంగా చూసుకున్నట్లయితే 75 శాతం మంచి…25శాతం వ్యతిరేకంగా ఉంటుందన్నారు. రాష్ట్రం వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండుతాయని తెలిపారు. ఆశ్యీయుజ మాసంలో తుఫాలను వచ్చే ప్రమాదం ఉందని…ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలని పంచాంగంలో ఉన్నట్లు వివరించారు.

ఈ ఏడాది కేసీఆర్ కు తిరుగుండదట…

తృతీయదిపతి రవి రాజ్యస్థానంలో ఉండట వల్ల తెలంగాణలో ప్రజారోగ్యం చక్కగా ఉంటుందట. ఈ ఏడాది శుభకృత్ నామ సంవత్సరం కాదని ఉద్యోగనామ సంవత్సరమని పంచాంగంలో ఉన్నట్లుగా చెప్పారు. తెలంగాణలోని నిరుద్యోగులకు ఈ సంవత్సరం శుభ ఏడాదిగా ఉందని చెప్పారు. విద్యా విధానంలో నూతన విధానాలు వస్తాయన్నారు.

సాహసోపేతమై ప్రకటనలు ఉంటాయి….

ముఖ్య నేతలకు భద్రత పెరుగుతుందని చెప్పారు. దేశంలో అలజడులు ఉంటాయని సంతోష్ కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. దేశంలో మధ్యప్రదేశ్‌తో పాటు మరికొన్ని చోట్ల రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇక ప్రజలు పొదుపు పాటించకపోతే శ్రీలంక పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ ఏడాది సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు ప్రకటిస్తారని తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.