Babu Mohan: బాస్ కేసీఆర్ కాదు.. పాలే, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబు మోహన్

వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబు మోహన్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కొద్దీ రోజులుగా బాబు మోహన్ బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నారన్న వార్తలు వినిపించాయి

Babu Mohan: వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబు మోహన్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కొద్దీ రోజులుగా బాబు మోహన్ బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నారన్న వార్తలు వినిపించాయి. కేసీఆర్ బాబూమోహన్ కు కాల్ చేసి మాట్లాడినట్లు ఫేక్ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాను పార్టీ మారట్లేదని, కేఏ పాల్ పార్టీ తరుపున ఎంపీ బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.

బాబు మోహన్ మాట్లాడుతూ… నేను పార్టీలో చేరిన రోజే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులుగా కూడా నేను కొనసాగుతున్నాను. నేను పుట్టింది పెరిగింది నా బాల్యమంతా వరంగల్ లోనే సాగింది. నేను ప్రజాశాంతి పార్టీలోనే ఉన్నాను, రానున్న లోకసభ ఎన్నికల్లో ప్రజా ప్రశాంతి పార్టీ తరపునే పోటీ చేస్తానన్నారు బాబు మోహన్.

We’re now on WhatsAppClick to Join

పార్టీ మారుతున్నాను.. అలాంటి వదంతులు పుట్టించకండని విజ్ఞప్తి చేశారు. వరంగల్ ప్రజలకు సేవ చేసేందుకు మీ ముందుకు వస్తున్నాను. 25 సంవత్సరాలుగా పాలిటిక్స్ లో ఉన్నాను. ఈ నాటికి ఏక్కడ అబద్ధం ఆడలేదు. బిజెపికి వెట్టి చాకిరి చేశాను. ఎంతోమందికి సభలు నిర్వహించానన్నారు. అలాగే కేఏ పాల్ పేద విద్యార్థులకు ఉచిత హాస్టల్లు, విద్య అందిస్తున్నారని చెప్పారు.

Also Read: RBI: ఆర్బీఐకి 90 ఏళ్లు.. ప్రత్యేక రూ. 90 నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ