Babu Mohan : బాబు మోహన్ నామినేషను తిరస్కరించిన అధికారులు

ఈయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ప్రతిపాదించిన వ్యక్తుల సంతకాలు లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు

Published By: HashtagU Telugu Desk
Babu Mohan

Babu Mohan

తెలంగాణ లో 17 లోక్ సభ (Lok Sabha Elections) స్థానాలకు సంబదించిన నామినేషన్ల (Nominations) పర్వం ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 17 సీట్లకు 893 మంది నామినేషన్లు వేశారు. అయితే ఈ 893 మంది నామినేషన్లలో 267 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. వారిలో మాజీ మంత్రి బాబుమోహన్‌ నామినేషన్ కూడా ఉంది. వరంగల్ ఎంపీ సీటుకు ఈయన నామినేషన్ దాఖలు చేసారు. ఈయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ప్రతిపాదించిన వ్యక్తుల సంతకాలు లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు.

We’re now on WhatsApp. Click to Join.

వాస్తవానికి బాబూమోహన్ మార్చి 24న కేఏ పాల్ “ప్రజాశాంతి” పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో… పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబు మోహన్‌ ను నియమిస్తున్నట్లు పాల్ ప్రకటించారు. ఈ సమయంలో వరంగల్ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. అయితే నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అదే రోజు ప్రజాశాంతి పార్టీకి రాజీనామా చేసినట్లు బాబు మోహన్ వెల్లడించారు. అనంతరం వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బాబు మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన నామినేషన్‌ తోపాటు 10 మంది ఓటర్ల పేర్లను సమర్పించారు. అయినప్పటికీ ఆయన నామినేషన్ తిరస్కరించబడింది. ఇది బాబు మోహన్ కు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఈయన తో పాటు సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ మందా జ‌గ‌న్నాథం నామినేషన్ ను సైతం అధికారులు తిరస్కరించారు. నాగ‌ర్ క‌ర్నూలు స్థానానికి బీఎస్పీ అభ్య‌ర్థిగా మందా జ‌గ‌న్నాథం నామినేషన్ దాఖలు చేసారు.నామినేషన్ లో బీ ఫామ్ జత చేయ‌క‌పోవ‌డంతో నామినేష‌న్ ను తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది.

Read Also : KCR 1st Tweet : సోషల్ మీడియాలో కేసీఆర్ పెట్టిన ఫస్ట్ పోస్ట్ ..

  Last Updated: 27 Apr 2024, 04:43 PM IST