తెలంగాణ లో మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార , ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారం తో దూకుడు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అధినేత , సీఎం కేసీఆర్ (CM KCR) రేస్ గుర్రం ల రేసులో దూకుడు కనపరుస్తున్నాడు. అభ్యర్థుల ప్రకటనే కాదు..ప్రచారం కూడా అందరికంటే ముందే మొదలుపెట్టి రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇదిలా ఉంటె అభ్యర్థుల ప్రకటన తర్వాత అన్ని పార్టీలకు అసమ్మతి సెగలు ఎక్కువై పోతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ కి రాజీనామా చేస్తూ వస్తున్నారు. అధికార పార్టీ బిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీలలో కూడా ఇలా అసమ్మతి సెగలు తగలగా..తాజాగా బిజెపి పార్టీ కి సైతం మొదలైనట్లు తెలుస్తుంది. బిజెపి నేత , సినీ నటుడు బాబు మోహన్ (Babu Mohan) తనకు టికెట్ రాలేదని చెప్పి పార్టీ కి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా తో మాట్లాడుతూ..తనకు టికెట్ ఇవ్వకపోవడంపై బీజేపీపై ఆ పార్టీ నేత బాబు మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయదల్చుకోలేదని, తాను ఎన్నికలతో సహా పార్టీకి దూరంగా ఉండబోతున్నానని తెలిపారు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి పార్టీకి కూడా రాజీనామా చేస్తా అని బాబు మోహన్ స్పష్టం చేశారు. తనను, తన కొడుకును విడదీసే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ లిస్టుల పేరుతో చేస్తున్న దాపరికం నచ్చలేదు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి పార్టీకి కూడా రాజీనామా చేస్తా. సోషల్ మీడియాలో నాకు టికెట్ రాదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నాక్కాకుండా నా కొడుకుకు టికెట్ ఇస్తున్నారు అంటూ ప్రచారాలు చేస్తున్నారు. నన్ను, నా కొడుకును విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అనవసరమైన ఊహగానాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆత్మభిమానాని దెబ్బతీస్తే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది’ అని బాబు మోహన్ అన్నారు.
‘బీజేపీ పెద్దలకు ఒకటే చెప్తున్నా.. మీరు అర్హులు అయిన వారికే టికెట్ ఇచ్చుకోండి. నాకు అవమానాలు చాలా జరిగాయి. ఇప్పటికైనా నా మీద మీడియాలో తప్పుడు ప్రచారాలను ఆపండి. నా ఆత్మభిమానం దెబ్బ తినడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నా. నాకు, నా కొడుకుకు మధ్య పోటీ ఏంటి?. బీజేపీ మొదటి జాబితాలో నా పేరు ప్రకటించకపోవడం వల్లే నాపై తప్పుడు ప్రచారాలు మొదలయ్యాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. బండి సంజయ్, కిషన్ రెడ్డి నా ఫోన్ లిఫ్ట్ చేయరు. నన్ను వారు కావాలనే దూరం పెట్టారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also : Chandrababu Mulakat : జైల్లో చంద్రబాబును ఆలా చూసి తట్టుకోలేకపోయిన కుటుంబ సభ్యులు