Site icon HashtagU Telugu

Nagar Kurnool: తీవ్ర విషాదం: డెంగ్యూతో బీటెక్ విద్యార్థిని మృతి

Nagar Kurnool, Nikitha Death

Nagar Kurnool, Nikitha Death

Nagar Kurnool: భారీ వర్షాల నడుమ డెంగ్యూ మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. తెలంగాణలో డెంగ్యూ ప్రభావం భయాందోళనలు పుట్టిస్తుంది. తాజాగా డెంగ్యూ సోకి ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. 21 ఏళ్ళ నికిత మృతితో కర్నూల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురు డెంగ్యూ కారణంగా మరణించడం తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.

డెంగ్యూ జ్వరంతో బీటెక్ విద్యార్థిని మృతి చెందడంతో నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ వెనుక నివాసం ఉంటున్న మిర్యాల శ్రీనివాసులు రెండో కుమార్తె నికిత (21) హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్‌ చదువుతోంది.

నికిత నెల రోజుల క్రితం సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చినా కొద్దిసేపటికే అస్వస్థతకు గురైంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ గణనీయంగా తగ్గిపోయిందని, డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయింది. మెరుగైన వైద్యం కోసం వైద్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. 15 రోజులుగా ఆమె చికిత్స కోసం 1.5 లక్షలకు పైగా ఖర్చు చేసినప్పటికీ, ఆమెను రక్షించలేకపోయామని కుటుంబ సభ్యులు తమ బాధను వ్యక్తం చేశారు.

Also Read: Karun Nair: గుర్తింపు కోసం ఆరాటపడుతున్న కరుణ్ నాయర్, నరనరాల్లో క్రికెట్