Azmat Ali Khan: తొమ్మిదవ నిజాంగా అజ్మత్ జా ఎంపిక

హైదరాబాద్‌కు చెందిన ఎనిమిదవ నిజాం ముకర్రం జా మరణం తరువాత అతని కుమారుడు మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్ (Azmat Ali Khan)ను హైదరాబాద్ తొమ్మిదవ నిజాంగా ప్రకటించారు. ఈ మేరకు నిజాం కార్యాలయం చౌమహల్లా ప్యాలెస్‌ నుంచి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Azmat Ali

Resizeimagesize (1280 X 720) (3)

హైదరాబాద్‌కు చెందిన ఎనిమిదవ నిజాం ముకర్రం జా మరణం తరువాత అతని కుమారుడు మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్ (Azmat Ali Khan)ను హైదరాబాద్ తొమ్మిదవ నిజాంగా ప్రకటించారు. ఈ మేరకు నిజాం కార్యాలయం చౌమహల్లా ప్యాలెస్‌ నుంచి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ముకర్రం జా జనవరి 14న టర్కీలోని ఇస్తాంబుల్‌లో మరణించారు. జనవరి 18న ప్రభుత్వ గౌరవాలతో హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించారు.

నిజాం వారసుడిగా తొమ్మిదవ నిజాంగా అజ్మత్ జాను కుటుంబసభ్యులు ఎంపిక చేశారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం ట్రస్టీల మధ్య సాంప్రదాయ పద్ధతిలో ప్రక్రియను నిర్వహించామని చౌమొహల్లా ప్యాలెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ముకర్రం జా కుమారుడైన అజ్మత్ జా లండన్ లోనే ప్రాథమిక, ఉన్నత చదువులు చదివారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో ఫొటోగ్రఫీలో పట్టా పొందిన ఆయన.. ఫొటోగ్రఫీనే వృత్తిగా ఎంచుకున్నారు.

Also Read: New DGCA Chief: డీజీసీఏ డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ దేవ్ దత్.. ఫిబ్రవరి 28 నుంచి బాధ్యతలు..!

అంతేకాదు హాలీవుడ్ లో కొన్ని సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా, సినిమాటోగ్రాఫర్ గా విధులు నిర్వహించారు. తండ్రి అంత్యక్రియల కోసం హైదరాబాద్ కు వచ్చిన ఆయన ప్రస్తుతం పాతబస్తీలో ఉంటున్నారు. ముకర్రం జా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన సాధారణ వేడుకలో ఆయనను నిజాం IXగా ప్రకటించారు. అజ్మత్ జా.. ముకర్రం జా, ఎస్రాలకు జన్మించాడు. 1971లో కేంద్ర ప్రభుత్వం బిరుదులను రద్దు చేసినందున నిజాం IXకి బిరుదు ఉండదు.

  Last Updated: 22 Jan 2023, 12:59 PM IST