Site icon HashtagU Telugu

Hyderabad: మాగంటి కంచుకోటలో అజారుద్దీన్ పాగా

Hyderabad

New Web Story Copy 2023 08 10t152510.828

Hyderabad: తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలైంది. అధికారం కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాన్ని ప్రదర్శిస్తుంది. నాలుగేళ్లు పార్టీని వదిలేసిన కాంగ్రెస్ అనూహ్యంగా బలమైన పార్టీగా అవతారమెత్తింది. బీజేపీ వ్యవహారం ఎటూ తేల్చలేకపోతుంది. రాష్ట్రస్థాయిలో బీజేపీకి సరైన నాయకులూ కూడా కనిపించడం లేదు. కేవలం బీజేపీ హైదరాబాద్ బల్దియా ఎన్నికలకే పరిమితం అన్నట్టుగా ఆ పార్టీ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సారి క్రికెట్ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగనున్నారు.

టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. అజారుద్దీన్ నియోజకవర్గంలోని స్థానిక పార్టీ కార్యకర్తలతో చాయ్ పే చర్చలో పాల్గొని పరిస్థితిని అంచనా వేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌ ఇస్తే జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేస్తానన్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే నా కోరికను ఇదివరకే వ్యక్తం చేశానని తెలిపారు. నిజానికి జూబ్లీహిల్స్ అంటే మాగంటి గోపినాథ్ గుర్తుకు వస్తారు. ఈ ప్రాంతం ఆయన కంచుకోటగా భావిస్తారు. మాగంటి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

Also Read: UPI Lite: గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వాడే వారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. యూపీఐ లైట్ చెల్లింపు పరిమితి పెంపు..!