Site icon HashtagU Telugu

Hyderabad: క్షుద్ర పూజలతో పట్టుబడిన ఆయుర్వేద వైద్యుడు అరెస్ట్

Hyderabad (3)

Hyderabad (3)

Hyderabad: టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చినా కొంతమంది మూర్ఖంగా క్షుద్ర పూజలనే నమ్ముతున్నారు. మూఢనమ్మకాలను నమ్ముకుని కొందరు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. మరోవైపు నగరంలో ఫేక్ డాక్టర్లు పుట్టగొడుగుల్లాగా పెరిగి పోతున్నారు. ఓ వ్యక్తి ఒకవైపు ఆయుర్వేద వైద్యుడుగా ఉంటూ మరోవైపు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ లో ఓ డాక్టర్ మూఢనమ్మకంతో తనవద్దకు వచ్చిన రోగికి ఏవో మంత్రాలూ ఇచ్చి కటకటాల పాలయ్యాడు. వివరాలలోకి వెళితే..

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్న 31 ఏళ్ళ కార్తీక్ గత కొంతకాలంగా తలనొప్పి మరియు నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఎంత మంది డాక్టర్లకు చూపించిన సమస్యకు పరిష్కారం దొరకలేదు. దీంతో ఆయుర్వేద వైద్యం తీసుకోవాలని భావించాడు. చికిత్స కోసం ఎల్‌బీ నగర్‌లోని తరుణ్ ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న ఆయుర్వేద వైద్యుడు జ్ఞానేశ్వర్‌ను సంప్రదించాడు.కానీ కార్తీక్‌కు ట్రీట్‌మెంట్ కి బదులుగా, అతనికి నిమ్మకాయ మరియు బూడిదను ఇచ్చి క్షుద్రపూజలు చేయాల్సిందిగా సూచించాడు. తాను చెప్పినట్టు పూజలు చేసి అమావాస్య రాత్రికి తిరిగి రావాలని చెప్పాడు. ఈ క్రమంలో పేషేంట్ కార్తీక్ వద్ద రూ. 50,000 వసూలు చేశాడు. బాధితుడి ఎం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించాడు. మోసపోయానను డాక్టర్ తతంగం అంతా వివరించాడు. రంగంలోకి దిగిన పొలుసులు డాక్టర్ బాబుపై కేసు నమోదు చేశారు. ఆయుర్వేద వైద్యుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read: Telangana : బిఆర్ఎస్ మరో కీలక నేతను కోల్పోబోతుందా..?

Exit mobile version