Site icon HashtagU Telugu

Award to Yadadri: యాదాద్రికి ‘ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం’ అవార్డు!

Yadadri

Yadadri

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమల తరహాలో యాదగిరిగుట్టను తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. యాదాద్రికి పునర్ వైభవం తీసుకొచ్చిన తర్వాత భక్తుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి 2022 – 2025 సంవత్సరానికి గాను “ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్” ద్వారా “గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్” (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు లభించింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడం ఆనందంగా ఉంది.

తెలంగాణ దేవాలయాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రావడం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ఎంతో గౌరవమని అన్నారు. ‘ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం’ అవార్డు, ప్రజల మనోభావాలు, మత సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రభుత్వం చేపట్టిన యాదగిరిగుట్ట పునరుద్ధరణ కేసీఆర్ అన్నారు. భారతీయ ఆధ్యాత్మికత పునరుజ్జీవన వైభవానికి నిదర్శనం. యాదాద్రి ఆలయ పవిత్రతకు, దైవభక్తికి విఘాతం కలగకుండా ‘ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌’ చేపట్టిన ఆధునీకరణ పనులను ప్రశంసించడం ప్రభుత్వానికి గర్వకారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.