Site icon HashtagU Telugu

Viral : RTC బస్సుల్లో ఆటో డ్రైవర్ల బిక్షాటన

Auto Drivers Protest By Beg

Auto Drivers Protest By Beg

రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవ ర్లు భిక్షాటన చేపట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉ చిత ప్రయాణం కల్పించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మా బతుకులు రోడ్డున పడ్డాయి.. అ క్కా సాయం చేయి.. అమ్మా సాయం చేయి’ అంటూ భిక్షమెత్తుతూ నిరసన తెలిపారు.

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలైన దగ్గరి నుండి ఆటోడ్రైవర్లు (Auto Drivers) రోడ్డున పడ్డారు. ఫ్రీ అనేసరికి మహిళలే కాదు ఎవ్వరు కూడా ఆటో ఎక్కేందుకు ముందుకు రావడం లేదు. కాస్త ఆలస్యమైనా బస్సు ఎక్కే వెళ్లాలని చూస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా తయారైంది.

రోజు ఆటో నడిపి కుటుంబాన్ని పోషించుకునే వారు..ఫ్రీ పథకం వల్ల బిక్షాటన చేసే పరిస్థితికి వచ్చిందని వారంతా గగ్గోలు పెడుతున్నారు. వెంటనే ఈ పథకం రద్దు చేయడం లేదంటే మాకేమైనా దారి చూపించాలని వారంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రతి రోజు వినూత్న నిరసనలతో వారి ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. తాజాగా మేడ్చల్‌లో ఆటో డ్రైవర్లు బస్సుల్లో బిక్షం (Auto Drivers Protest by Begging) అడుక్కుంటూ వారి ఆవేదనను వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

మహిళలు, విద్యార్థులు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడంతో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడిందని.. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘం వారు వాపోయారు. మహిళలు, విద్యార్థినిలు, ఉద్యోగులతో కిట కిటలాడిపోయే ఆటోలు, క్యాబ్ లు ఖాళీ గా ఉండిపోతున్నాయి. మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ బాగా పెరిగిపోయింది. ఈ స్కీమ్ ద్వారా మహిళలు లబ్దీ పొందుతున్నా.. ఆటో డ్రైవర్లు నష్టపోతున్నామంటున్నారు. రోజూ 1000 రూపాయాలు వచ్చేది కేవలం రూ.300 మాత్రమే వస్తున్నాయని వాపోతున్నారు. ఇంటి అద్దెలు, ఆటో ఫైనాన్స్, పిల్లల చదువులు, నెలవారి ఖర్చులు భారమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మ పథకం ద్వారా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని.. వారికి ప్రతి నెల రూ. 15 వేల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్ లో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు.

Read Also : Anti India Graffiti : మరో హిందూ ఆలయంపై ఖలిస్తానీ మూకల పిచ్చిరాతలు