తెలంగాణ (Telangana) లో ఆటో డ్రైవర్లు (Auto Drivers) సమ్మెకు (Bandh) దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పూటగడవడం కూడా కష్టంగా మారిందని..రోజుకు రూ.500 నుండి రూ.1000 సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునేవాళ్లమని..ఇప్పుడు కనీసం రూ. 200 కూడా సంపాదించుకోలేకపోతున్నామని వారంతా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి వారి ఆవేదనను వ్యక్తం చేయడం , ఆటో యూనియన్ లీడర్లు సీఎం రేవంత్ కలవడం జరిగింది. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాకపోయేసరికి…తమ ఆందోళనను ఉదృతం చేయాలనీ ఫిక్స్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరుణంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. ఉచిత బస్సు స్కీంతో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టబోయే ఆటో బంద్‌ను ప్రతి ఒక్క డ్రైవర్ విజయవంతం చేయాలని అన్నారు.
Read Also : RLD – BJP : ‘ఇండియా’కు మరో షాక్.. బీజేపీతో చెయ్యి కలిపిన ఆ పార్టీ !