Govt Schools : సర్కారు వారు బడి : అటెండెన్స్ ఫుల్.. సౌకర్యాలు నిల్!

కరోనా రాకతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారాయి. ఓడలు బండ్లు అయ్యాయి. బండ్లు ఓడలవుతున్నాయ్. ముఖ్యంగా చిన్నచితక పనులు చేసుకునే మధ్య, పేదతరగతి ప్రజల ఇబ్బందులు అంతాఇంతా కావు..

  • Written By:
  • Updated On - December 6, 2021 / 11:44 AM IST

కరోనా రాకతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారాయి. ముఖ్యంగా చిన్నచితక పనులు చేసుకునే మధ్య, పేదతరగతి ప్రజల ఇబ్బందులు అంతాఇంతా కావు.. కరోనా కారణంగా రోజువారి పనుల్లేక అల్లాడిపోయారు. ఒక్కపూట తిండి కోసం ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక పరిస్థితులతో సతమతమయ్యారు. కేసులు తగ్గడంతో ఇప్పుడిప్పుడే సర్కారు బళ్లు ప్రారంభమవుతున్నాయి. అయితే ఎప్పుడూ లేని విధంగా ఆసారి ప్రభుత్వ స్కూళ్లలో అటెండెన్స్  పెరిగింది. ప్రైవేట్ స్కూళ్లలో వేలకువేలు ఫీజులు కట్టి చదివించలేకపోవడమే కారణం. ఆర్థిక భారాన్ని మోయలేక చాలామంది తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. అయితే అటెండన్స్ పెరిగినా… విద్యార్థులకునుగుణంగా వసతులు లేకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది!

నేలమీద పాఠాలే…

తెలంగాణ రాష్ట్రంలో 26 వేలకుపైగా పాఠశాలలున్నాయి. అందులో కొన్ని పాఠశాలలో నేల మీద పిల్లలు కూర్చొని పాఠాలు వినాల్సి వస్తోంది. కొన్ని చోట్లా అయితే పరదాలు వేసి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు టీచర్లు

టీచర్లు ఏరీ?

విద్యార్థులకనుగుణంగా టీచర్లు లేకపోవడం కూడా ప్రభుత్వ బళ్లను వేధిస్తోంది. చాలా చోట్లా 1 నుంచి 5 చదివే పిల్లలకు ఒకరు లేదా ఇద్దరు టీచర్లతో పాఠాలు చెప్పే పరిస్థితి నెలకొంది. విద్యార్థులకనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోతే ప్రభుత్వ లక్ష్యం నీరుగారే పరిస్థితి ఉంది.

నో టాయిలెట్

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్లా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కనిపిస్తున్నా.. స్కూళ్లలో మాత్రం కనిపించడం లేదు. మరుగుదొడ్లు లేక ముఖ్యంగా బాలికలు విద్యకు దూరమవుతున్న సంఘటనలు ఉన్నాయి. మగపిల్లలయితే ఆరుబయటకు వెళ్తున్నారు. అమ్మాయిలు మాత్రం ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

పాత బిల్డింగులే దిక్కు

కరోనా కారణంగా దాదాపుగా ఏడాదిన్నరపైగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. రాష్ట్రంలోని అనేక పాఠశాలలో పాత బిల్డింగ్స్ లో విద్యాబోధన జరుగుతోంది. కొన్నింట్లో పెచ్చులూడి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. ఎప్పుడూ కూలుతాయో తెలియని పరిస్తితుల్లో నేపథ్యంలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలకు అటెండ్ అవుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ విద్యాశాఖ స్పందించి బళ్లలో సౌకర్యాలు కల్పిస్తే హాజరుశాతం మరింత పెరిగే అవకాశం ఉంది.