Site icon HashtagU Telugu

Khammam : రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడి పై కత్తులతో దాడి..

Attack On Surampalli Ramara

Attack On Surampalli Ramara

లోకో సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం జిలాల్లో మాజీ కేంద్ర మంత్రి , కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడి పై కత్తులతో దాడి జరగడం తో జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం (Khammam) జిల్లా వైరా (Vyra) నియోజకవర్గంలోని కొణిజర్ల (Konijerla) గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రధాన అనుచరుడు సూరంపల్లి రామారావు (Surampalli Ramarao) పై గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు మూత్రవిసర్జన చేసేందుకు ఇంట్లోంచి బయటికి వచ్చిన రామారావుపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు పథకం ప్రకారం కత్తులతో దాడి చేశారు. ఈ దాడితో సూరంపల్లి రామారావు కడుపులో పాటు పలుచోట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన రామారావు కేకలు వేయడంతో స్థానికంగా జరుగుతున్న ఓ వివాహానికి వెళ్లి వస్తున్న వారు చూసి అతనిని వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భూ వివాదాల వల్ల కొణిజర్లకు చెందిన కొంతమంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతుంది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామారావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 144సెక్షన్ అమలు చేస్తున్నారు.

Read Also : Chalimidi: వేసవిలో చలువ చేసే చలిమిడి.. టేస్టీగా పిల్లలకు చేసి పెట్టండిలా?