Site icon HashtagU Telugu

TS: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై చెప్పుల దాడి..!!

Rasamayi

Rasamayi

మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రసమయి కాన్వాయ్ పై యువకులు చెప్పులతో దాడి చేవారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈఘటనతో పోలీసులు యువకులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. ఈ ఘటన గన్నేరువరం మండలం గండ్లపల్లిలో జరిగింది. డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని యువకులు ధర్నా చేపట్టారు. అయితే వారికి సంఘీభావం తెలిపిందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే రసమయి కాన్వాయ్ పై చెప్పులతో దాడి జరిగింది. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కాన్వాయ్ పై జరిగిన దాడిని ఎమ్మెల్యే రసమయి తీవ్రంగా ఖండించారు.

దాడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిఒక్కరిని నిరసన తెలిపే హక్కు ఉంది కానీ కాంగ్రెస్ నేత కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో దొంగచాటుగా ఈ దాడి జరిగింది. ఇది హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము తలచుకుంటే ఈ నియోజకవర్గంలో కవ్వంపల్లి సత్యనారాయణ అడ్రెస్ కూడా ఉండదంటూ హెచ్చరించారు రసమయి బాలకిషన్ .