Site icon HashtagU Telugu

BRS కార్యాలయంపై దాడి.. ఖండించిన హరీష్ రావు

Attack Brs Office

Attack Brs Office

యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం(BRS Office)పై కాంగ్రెస్‌ నేతలు, ఎన్‌ఎస్‌యూఐ నాయకుల దాడి చర్చనీయాంశమైంది. శనివారం మీడియా సమావేశం సందర్భంగా, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డిపై దాడి చేసి, కార్యాలయ ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఇంకా పార్టీ కార్యకర్తలపైనా దాడి యత్నాలు జరిపారు. ఈ దాడిని బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. పోలీసులు సమక్షంలోనే ఇలాంటి దాడి జరగడం అన్యాయమని, ఇది కాంగ్రెస్‌ నేతల చేతగానితనాన్ని సూచిస్తోందని పేర్కొంది.

Liquor Policy of Delhi : ఢిల్లీ లిక్కర్ పాలసీపై కాగ్ నివేదిక

హరీష్‌రావు (Harish Rao) ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులకు దిగడం కాంగ్రెస్‌ దుర్మార్గానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, కానీ దాడుల సంస్కృతిని ప్రోత్సహించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తమ చేతగానితనాన్ని దాచడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)సీఎమాటలతో కార్యకర్తలు దాడులు చేస్తే, ఆ పార్టీ నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అలజడి నెలకొనడం ఆందోళనకరమని హరీష్‌రావు తెలిపారు. ఇలాంటివి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు. ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజా పాలన? అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులపై జరుగుతున్న దాడులు ఆ పార్టీ నాయకత్వాన్ని భయపెట్టలేవని హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆ పార్టీ బలంగా నిలిచి ప్రజాసమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకత్వం బాధ్యతాయుతమైన వైఖరిని పాటించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ తగిన రీతిలో బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.