సోమవారం మధ్యాహ్నం BRS ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) ఫై హత్యాయత్నం చోటుచేసుకుంది. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలో దౌల్లాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి (Unknown Person Attack) కత్తి (Knife)తో దాడి చేశాడు. దీంతో ప్రభాకర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కడుపులో కత్తితో పొడవడం తో తీవ్ర రక్తప్రసావం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కార్యకర్తలు ఆయన్ను గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేసి..మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.
ఇక ప్రభాకర్ రెడ్డి ఫై దాడి చేసిన వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు కార్యకర్తలు. అతడు చెప్యాలకు చెందిన గటని రాజుగా పోలీసులు గుర్తించారు. అతను ఓ యూ ట్యూబ్ చానల్ లో పని చేస్తున్న విలేకరిగా తెలుస్తోంది. మరో వైపు కొత్త ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు ఫోన్ లో పరామర్శించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరున్న ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (BRS)కి, కేసీఆర్ (KCR) కు సన్నిహితుడు. కేపీఆర్ ట్రస్టు ద్వారా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంకోసం మెదక్ లోకసభ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభాకర్ రెడ్డి పోటీచేసి గెలుపొందారు. 2104 సెప్టెంబరు 13న జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పై భారీ మెజారిటీతో గెలిచారు. 2014, నవంబరు 25న లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రభాకరరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ప్రస్తుతం దుబ్బాక (Dubbaka) బరిలో బిఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు.