Site icon HashtagU Telugu

Attack On Barrelakka : కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క పై దాడి

Attack On Barrelakka

Attack On Barrelakka

కొల్లాపూర్ (Kollapur ) నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క (Barrelakka ) (శిరీష ) పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై తనదైన శైలిలో అధికార పార్టీ ఫై విమర్శలు గుప్పించి సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయిన బర్రెలక్క(శిరీష) (Shirisha)..ఇప్పుడు తెలంగాణ ఎన్నికల దంగల్ లో బరిలోకి నిలిచిన సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

నాగ‌ర్ క‌ర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ (Kolhapur )నియోజ‌క‌వ‌ర్గంలో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బర్రెలక్క(శిరీష) బ‌రిలోకి దిగింది. ఆమెకు ప‌ట్టుమ‌ని ల‌క్ష రూపాయలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. ధైర్యంగా, గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగింది. ఈమె ధైర్యాన్ని చూసి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటూ ఆమెకు సపోర్ట్ పలుకుతున్నారు. సోష‌ల్ మీడియాలో శిరీష‌కు అనుకూలంగా.. పాట‌లు, నినాదాలు.. పోటెత్తుతున్నాయి. స్వ‌చ్ఛంద సంస్థ‌లు బ్యాన‌ర్లు, ఎన్నిక‌ల సామాగ్రిని ఆమెకు అందిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం అంటేనే డబ్బు తో కూడుకున్నది. ప్రతిదీ ఖర్చు చేస్తూ పోవాల్సిందే. కానీ శిరీష్ ప్రచారంలో అన్ని ఖర్చులు వేరే వారే చూసుకుంటున్నారు. రోజు రోజుకు ప్రజల నుండి ఆమెకు సపోర్ట్ పెరుగుతుండడం తో ఆమె కూడా ఎక్కడ కూడా తగ్గేదేలే అంటూ ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది.

ఇక మంగళవారం పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆమెపై, ఆమె తమ్ముళ్ల ఫై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనపై ఏ పార్టీ వారు దాడి చేశారో తెలియదని.. తాను ఎన్నికల బరిలో ఉంటే ఓట్లు చీలుతాయనే భయంతో దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. తమకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు.

Read Also : Telangana: కేసీఆర్ కు జై కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి

 

Exit mobile version