హైదరాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. బాలానగర్‌లో దారుణ ఘటన జరిగింది. కేవలం రూ.400 కోసం దారుణ హత్య చోటుచేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. రూ.400 కోసమే హత్య చేయడం సంచలనంగా మారింది. కోపంలోనే క్షణికావేశంలో ఇలా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన కాశీరామ్, శ్రీనివాస్ అనే ఇద్దరు కూలీలు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే రెండు రోజుల పాటు ఇద్దరూ కూలీపనికి వెళ్లారు. అయితే కూలీ డబ్బులకు సంబంధించి రూ.400 కాశీరామ్‌కు శ్రీనివాస్ తక్కువగా ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం ఎక్కువై ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది.
ఈ క్రమంలో నర్సాపూర్ క్రాస్ రోడ్ పుత్‌పాత్‌పై శ్రీనివాస్ నిద్రిస్తున్న సమయంలో కాశీరామ్ దారుణానికి పాల్పడ్డాడు. కాశీరామ్ ను కర్రతో తీవ్రంగా కొట్టాడు. రూ.400 విషయంలో ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. దీంతో శ్రీనివాస్‌పై కాశీ రామ్ దాడి చేశాడు. అతడిని గాయపర్చి అనంతరం కోపంలో శ్రీనివాస్‌ను రోడ్డుపై వెళుతున్న లారీ కిందకు తోదేశాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ ను లారీ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.
లారీ ఢీకొట్టడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ సీఐ భాస్కర్ స్పష్టం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, కోర్టుకు తరలిస్తామని పోలీసులు చెబుతున్నారు.రూ.400 కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, కోపోద్రికుడైన కాశీరామ్.. శ్రీనివాస్ ను కర్రతో కొట్టి, ఆ తర్వాత లారీ కిందకు తోసేసినట్లు పోలీసులు తెలిపారు. రూ.400 కోసం వ్యక్తిని హత్య చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.