BITS Pilani Hyderabad : బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ‘అట్మోస్ – 2024’ పేరుతో టెక్ ఈవెంట్ జరుగుతోంది. ఇందులో విద్యార్థులు తాము తయారుచేసిన పలు టెక్ ప్రోడక్ట్స్‌ను ప్రదర్శిస్తున్నారు. ఆకాశంలో ఉండే గ్రహాలను చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే వాటిని చూడాలంటే శక్తివంతమైన టెలిస్కోప్‌లు కావాలి. అలాంటి ఒక టెలిస్కోపును విద్యార్థులు ఈ ఈవెంటులో ప్రదర్శించారు. ‘సెలిస్ట్రాన్ ఎక్స్‌ఎల్‌టీ 925’ అనే పేరుతో ఒక టెలిస్కోపును స్వయంగా విద్యార్థులే తయారు చేశారు. ఇది 9.25 అంగుళాల వ్యాసార్థంతో ఉంటుంది. దీని నుంచి మనం బుధుడు, శని లాంటి గ్రహాలను చూడొచ్చు.
Also Read :Citadel Honey Bunny : ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లోని కోటకు మొఘల్స్‌తో లింక్.. చరిత్ర ఇదీ
ఈ టెలిస్కోపులో అతిపెద్ద భూతద్దాలు ఉంటాయి. సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలను దాదాపు 99 శాతం మేర ఇది ఫిల్టర్ చేస్తుంది. ఫలితంగా ‘సెలిస్ట్రాన్ ఎక్స్‌ఎల్‌టీ 925’ టెలిస్కోపు(BITS Pilani Hyderabad) నుంచి విశ్వంలోని గ్రహాలను చూసేటప్పుడు కంటికి ఎలాంటి ముప్పు ఉండదు. సూర్యుడి చుట్టూ ఉండే కరోనా అనే పొరను, సోలార్ స్పాట్లను పరిశీలించేందుకు ఈ టెలిస్కోప్ చాలా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్‌గా పని చేయడమే ఈ టెలిస్కోప్ ప్రత్యేకత అని విద్యార్థులు వివరించారు. ఈ ఈవెంట్‌లో భాగంగా ఐస్‌క్రీమ్ పుల్లలతో తయారు చేసిన భవనాల నమూనాలను ప్రదర్శించారు. అవి చూపరులను భలేగా ఆకట్టుకున్నాయి.
Also Read :Gabbar Singh : ‘గబ్బర్ సింగ్’ అమ్జద్ ఖాన్ జయంతి.. విలన్ పాత్రతో హీరో ఇమేజ్
ఆసియాలోనే అతిపెద్ద గామా రే టెలిస్కోప్
ఆసియాలోనే అతిపెద్ద గామా రే టెలిస్కోప్‌ను మన దేశంలోని లద్దాఖ్‌లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో (దాదాపు 4,300 మీటర్ల ఎత్తులో) ఏర్పాటుచేసిన టెలిస్కోపు కూడా ఇదే. లద్దాఖ్‌లోని హాన్లే అనే ఏరియాలో ఈ టెలిస్కోపు ఉంది. దీని పూర్తి పేరు మేజర్ అట్మాస్పియరిక్ చెరెన్‌కోవ్ ఎక్స్‌పరిమెంట్ (MACE). ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC), ఈసీఐఎల్, ఇతర పారిశ్రామిక సంస్థల సాయంతో దీన్ని మన దేశంలోనే తయారు చేశారు.