Site icon HashtagU Telugu

TS Assembly Live: అసెంబ్లీ సమావేశాలు షురూ, 42 పేజీలతో శ్వేతపత్రం రిలీజ్!

Telangana Budget

Revanth Reddy wants to Changes in Telangana Assembly

TS Assembly Live: ఇటీవలనే వాడీవేడిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ మళ్లీ ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ హాయంలో జరిగిన అభివ్రుద్ధి, ప్రాజెక్టులు తీరు, లోపాలపై తెలంగాణ కాంగ్రెస్ పవర్ ప్రజెంటేషన్ కు రెడీ అయ్యింది. ఈ మేరకు తెలంగాణ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల చేశారు. తెలంగాణ మొత్తం అప్పులు 72,658 కోట్లు ఉన్నట్టు తేల్చి చెప్పారు. ఈ శ్వేత పత్రాలు చదువుకునేందుకు దాదాపు అర గంట పాటు సభను వాయిదా వేశారు.

ఇక శాసనసభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి పార్టీని అనుమతించాలని భారత రాష్ట్ర సమితి మంగళవారం అసెంబ్లీ స్పీకర్‌ను అభ్యర్థించింది. బుధవారం తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్‌లో ఆర్థిక, నీటిపారుదల మరియు విద్యుత్‌తో సహా ఇతర కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంటేషన్‌ను అందించాలని యోచిస్తున్నట్లు నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా సిద్ధమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా శ్వేతపత్రాలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఇవాల సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాస్ రెడ్డి మృతిపట్ల సభ సంతాపం తెలిపింది. వారి కుటుంబానికి శాసనసభ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అలాగే పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరిశ్వర్ రెడ్డి మృతిపట్ల సభ సంతాపం తెలిపింది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతిపట్ల శాసనసభ సంతాపన్ని తెలియజేసింది. ముగ్గురు మాజీ శాసన సభ్యులకు సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు.

శ్వేతపత్రంలోని ప్రధానాంశాలు..

♦️రాష్ట్ర మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు.

♦️2014-15 నాటికి రాష్ట్ర రుణం ₹72,658 కోట్లు.

♦️2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.

♦️2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం ₹3,89,673 కోట్లు.

♦️2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.

♦️2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.

♦️బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం.

♦️57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ₹4.98 లక్షల కోట్ల వ్యయం.

♦️రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం.

Also Read: RTC Buses: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మాకొద్దు, ప్రభుత్వ టీచర్స్ వినూత్న నిర్ణయం