Assam CM: తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం.. అసోం సీఎం సంచలన ప్రకటన

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక ప్రకటనలు వెలుగుచూస్తున్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం వస్తుందని అన్నారు.

  • Written By:
  • Publish Date - July 3, 2022 / 05:00 PM IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక ప్రకటనలు వెలుగుచూస్తున్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం వస్తుందని అన్నారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. ఈ సమావేశాలను బీజేపీ ఇక్కడ పెట్టిందే తెలంగాణకు తమ బలం చూపాలని.. ఇక్కడ అధికారంలోకి రావాలని. అందుకే కమలనాథులు ఇచ్చే స్టేట్ మెంట్స్ లోనూ అదే విషయం స్పష్టమవుతోంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై పార్టీకి దిశానిర్దేశం చేయడమే ఆయన లక్ష్యం. విజయసంకల్ప సభ ద్వారా బీజేపీ వాయిస్ ను వినిపించడమే ఆయన టార్గెట్. ముఖ్యంగా తెలంగాణను లక్ష్యంగా చేసుకుని ఆయన స్పీచ్ ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ గేరు మార్చి మరీ దూకుడుగా వెళుతోంది. అందుకే తెలంగాణలో అధికారంలోకి రావాలంటే పార్టీ ఏ విధంగా సన్నద్దం కావాలన్నదానిపై మోదీ స్పీచ్ ఉంటుందని భావిస్తున్నారు.

ప్రజలను ఎలా తమ వైపు ఆకట్టుకోవాలి.. గ్రౌండ్ లెవల్ లో ఎలా సన్నద్దం కావాలి, ఎలా బలోపేతం కావాలన్నదానిపై మోదీ స్పీచ్ ఉండే అవకాశం ఉంది. ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూనే.. తమ ప్రభుత్వం అమలు చేసే కొన్ని పథకాల గురించి కూడా ఆయన ప్రస్తావించే ఛాన్సుంది. నిజానికి ఈ విషయాలను కేసీఆర్ ఈ నెల రెండోతేదీనే ప్రస్తావించారు. అంటే బీజేపీ విజయసంకల్ప సభకు ఒక రోజు ముందే మోదీ ఎలాంటి విషయాలను ప్రస్తావిస్తారో పరోక్షంగా ప్రస్తావించారు. దాంతోపాటే కొన్ని ప్రశ్నాస్త్రాలను కూడా సంధించారు. మరి వాటికి మోదీ ఎలాంటి సమాధానాలను ఇస్తారో చూడాలి.