Ask KTR : మంత్రి కేటీఆర్ ఎక్క‌డ‌? మౌనిక మ‌ర‌ణ పాపం ఎవ‌రిది?

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి ప్ర‌తి ఏడాది ఏదో ఒక చోట వ‌ర్షం కురిస్తే నాలాల్లో ప్రాణం పోయే వాళ్ల సంఖ్య ఎక్కువ‌గానే (Ask KTR) ఉంది.

  • Written By:
  • Updated On - April 29, 2023 / 01:32 PM IST

(Ask KTR )ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి ప్ర‌తి ఏడాది నాలాల్లో ప‌డి సామాన్యులు ప్రాణం కోల్పోతున్నారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాల‌న‌లో దాదాపు ప్ర‌తి ఏడాది ఏదో ఒక చోట వ‌ర్షం కురిస్తే నాలాల్లో ప్రాణం పోయే వాళ్ల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. హైద‌రాబాద్ రోడ్ల‌ను ఇస్తాంబుల్ మాదిరిగా చేస్తాన‌ని హామీ ఇచ్చిన కేసీఆర్ నాలాల‌ను బాగుచేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. ఎనిమిదేళ్ల చిన్నారి(Mounika) ఉద‌యం పాల ప్యాకెట్ తీసుకురావ‌డానికి బ‌య‌ట‌కు వెళ్లిన మౌనిక‌ నాలాలో ప‌డి ప్రాణం విడిచింది.

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి ప్ర‌తి ఏడాది నాలాల్లో సామాన్యులు (Ask KTR )

సికింద్రాబాద్ కళాసిగూడలో మౌనిక‌(Mounika) నివాసం ఉంటోంది. శుక్ర‌వారం తెల్లవారు జామున పాలను తీసుకుని రావడానికి బయటికి వెళ్లింది. బాలిక నాలాలో పడి కొట్టుకుపోయింది. ఆమెను రక్షించే ప్రయత్నం స్థానికులు చేశారు. పోలీసులకూ సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మౌనిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పార్క్ లేన్ సమీపంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

గ‌త ఏడాది కార్లు, నాలాల్లో కొంద‌రు కొట్టుకుపోయారు

బాలిక తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలిక (Ask KTR)మరణించిందంటూ స్థానికులు ఆగ్ర‌హించారు. ప‌ట్ట‌ణ మున్సిపల్ శాఖామంత్రిగా ఉన్న కేటీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు సంఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్ల‌లేదు. క‌నీసం ప్ర‌తిప‌క్ష నేత‌లు కూడా అక్క‌డ‌కు చేరుకోలేదు. ప్ర‌తి ఏడాది ఇలాంటి సంఘ‌ట‌నలు జ‌రుగుతూనే ఉన్న‌ప్ప‌టికీ శాశ్వ‌త ప‌రిష్కారం మాత్రం ప్ర‌భుత్వం చూప‌లేక‌పోతోంది. వ‌ర్షం వ‌స్తే హైద‌రాబాద్ న‌గ‌రం మునిగిపోతోంది. గ‌త ఏడాది కార్లు కొట్టుకుపోయాయి. నాలాల్లో కొంద‌రు కొట్టుకుపోయారు. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోలేదు.

రెండో గంట‌ల వ్యవధిలోనే 7.8 సెంటీమీటర్ల మేర వర్షపాతం శుక్ర‌వారం ఉద‌యం న‌మోదు అయింది. ఆ మేర‌కు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అత్యధిక వర్షపాతం హిమాయత్‌నగర్‌, శేరిలింగంపల్లిల్లో నమోదైంది. హిమాయత్ నగర్- 7.8, శేరి లింగంపల్లి- 7.4 వర్షం కురిసినట్లు తెలుస్తోంది. మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌, నాంపల్లిలో ఆరు సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఉప్పల్‌, ఆసిఫ్‌నగర్‌, బాలానగర్‌లో అయిదు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం కురిసినట్లు చెబుతున్నారు.

క్లౌడ్ బ‌ర‌స్ట్ ప‌ద్ధ‌తిన వ‌ర్షాల‌ను ఒకే చోట కురిపించ‌డం

గ‌త ఏడాది కురిసిన వ‌ర్షాల‌కు న‌గ‌రం మునిగిపోయింది. ప‌లు చోట్ల ప‌డ‌వలు వేసుకుని ప్ర‌యాణం చేయాల్సిన దుస్థితి ఆ రోజు క‌నిపించింది. ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగింది. కానీ, ప్రభుత్వం మాత్రం కురిసిన వ‌ర్షం మీద అప‌వాదును మోపింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ (Ask KTR)అప్ప‌ట్లో కురిసిన భారీ వ‌ర్షాల గురించి ఇత‌ర దేశాల కుట్ర‌గా అభివ‌ర్ణించారు. మేఘాల‌పై దాడి చేసినందున ఒకే ప్రాంతంలో వ‌ర్షం భారీగా కురిసింద‌ని సెల‌విచ్చారు. విదేశీ కుట్ర లో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌రం మునిగిపోయింద‌ని కేసీఆర్ అప్ప‌ట్లో చెప్పారు. క్లౌడ్ బ‌ర‌స్ట్ ప‌ద్ధ‌తిన వ‌ర్షాల‌ను ఒకే చోట కురిపించ‌డం జ‌రుగుతుంద‌ని చెబుతూ త‌ప్పును విదేశీ కుట్ర అంటూ దాట‌వేశారు.

Also Read : KTR : జహీరాబాద్‌లో 1000 కోట్లతో మహేంద్ర ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ ప్లాంట్.. KTR శంకుస్థాపన..

ప్ర‌స్తుతం వేస‌వి కాలం. ఉరుముల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ రెండో రోజుల క్రితం అప్ర‌మ‌త్తం చేసింది. శుక్ర‌వారం రోజు ఉద‌యం వ‌ర్షం కురిసింది. కొద్దిపాటి వ‌ర్షానికి న‌గ‌ర‌మంతా నీళ్లతో నిండిపోయింది. నాలాలో ఎనిమిదేళ్ల బాలిక మౌనిక కొట్టుకుపోయింది. అదే భారీ వ‌ర్షాలు వ‌స్తే న‌గ‌రం ప‌రిస్థితి ఏమిటి అనేది పెద్ద ప్ర‌శ్న‌. విశ్వ‌న‌గ‌రంగా చెబుతోన్న హైద‌రాబాద్ వ‌ర్షం వ‌స్తే మాత్రం ప్రాణాల‌ను తోడేస్తుంద‌ని(Ask KTR) తాజా సంఘ‌ట‌న క‌న్నీటిని పెట్టిస్తోంది.

Also Read : BRS :మ‌రాఠాపై KCRఎత్తుగ‌డ‌,BRS ఔరంగాబాద్ స‌భ‌