ASI Umadevi Suspended : బీజేపీ అభ్యర్థిని కౌగిలించుకున్నందుకు ఏఎస్ఐ సస్పెన్షన్‌..

మాధవీలత ను.. డ్యూటీలో ఉన్న సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి.. కౌగిలించుకొని, కరచాలనం వేసిన వీడియో వైరల్ గా మారింది

Published By: HashtagU Telugu Desk
Asi Suspend

Asi Suspend

బీజేపీ లోక్‌సభ అభ్యర్థి మాధవి లత (Kompella Madhavi Latha) ర్యాలీలో ఎన్నికల కోడ్ (Election Code) ఉల్లంఘించినందుకు మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ను (ASI) హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కె. శ్రీనివాస రెడ్డి (Srinivas Reddy) సస్పెండ్ చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులు ఎన్నికల బరిలో ఉన్న పార్టీల నేతలతో పర్సనల్ గా కలవడం..వారిని అభినందనలు వంటివి తెలియజేయడం చేయకూడదు. ఈ తరుణంలో హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత ను.. డ్యూటీలో ఉన్న సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి.. కౌగిలించుకొని, కరచాలనం వేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై సీనియర్ అధికారులు విచారణ జరిపి, ఆమెను సస్పెండ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె మాధవీలత ఇటీవల వరుస వివాదాలకు కారణమవుతున్నాయి. ఒకవైపు లోక్సభ ఎన్నికల గడువు దగ్గర పడుతుంటే ఆమె బేగంబజార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ సిద్ది అంబర్ బజార్ మీదుగా శోభాయాత్ర కొనసాగుతున్న సమయంలో ఆమె ఒక మసీదు పైకి విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలినట్టు పోజ్ పెట్టారు. దీనిపై ముస్లింలు అభ్యంతరం తెలుపుతూ ఆమె పైన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. తాజాగా ఇప్పుడు మాధవి లత కారణంగానే పోలీస్ అధికారిణి సస్పెండ్ అయ్యింది. ఇలా వరుస వివాదాలతో ఆమె వార్తల్లో నిలుస్తుంది.

Read Also : KKR vs RCB: విరాట్ కోహ్లీకి భారీ జరిమానా మ్యాచ్ ఫీజులో 50 శాతం కట్

  Last Updated: 22 Apr 2024, 06:25 PM IST