Site icon HashtagU Telugu

Samoohika Jateeya Geethaalapana : టీఆర్ఎస్, ఎంఐఎం సంయుక్త `జాతీయవాదం`

Kcr Owaisi

Kcr Owaisi

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం లేకుండా ఏ ప‌నిచేయ‌రు. ఎలాంటి పిలుపు ఇవ్వ‌రు. తెలంగాణ వ్యాప్తంగా ఉద‌యం 11.30 గంట‌ల‌కు ఇచ్చిన జాతీయ గీతాలాప‌న ఆయ‌న రాజ‌కీయ చ‌తుర‌త‌లోని భాగంగా ప్ర‌త్య‌ర్థులు చూస్తున్నారు. ఆయ‌న ఇచ్చిన పిలుపు మేర‌కు తెలంగాణ వ్యాప్తంగా సంయుక్తంగా జాతీయ గీతాలాప‌న వినిపించింది. ఆ స‌మ‌యంలో ఎక్క‌డి వాళ్లు అక్క‌డే జాతీయ గీతాలాప‌న చేసేలా కేసీఆర్ పిలుపు నిచ్చారు. దీంతో మెట్రోతో స‌హా ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే నిలిచిపోవ‌డంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతం వినిపించింది. సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అస‌రుద్దీన్ ఓవైసీ క‌లిసి అబిడ్స్ వ‌ద్ద ఏర్పాటు చేసిన వేదిక‌పై గీతాలాప‌న చేయ‌డం గ‌మనార్హం.

జాతీయ ప్ర‌త్యామ్నాయ ఎజెండాను ద్వారా ప్ర‌ధాని పీఠాన్ని అందుకోవాల‌ని కేసీఆర్ ముందుకు క‌దులుతున్నారు. ఆ దిశ‌గా ఇప్ప‌టికే వేగంగా అడుగులు వేస్తున్న ఆయ‌న దేశ వ్యాప్తంగా మోడీ హ‌వాను త‌గ్గించాల‌ని భావిస్తున్నారు. అందుకోసం తెలంగాణ నుంచి శంఖారావం పూరించారు. క‌రోనా స‌మ‌యంలో దేశం మొత్తం చ‌ప్ప‌ట్లు కొట్టేలా చేసిన మోడీకి ధీటుగా ఒక్క పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా జాతీయ‌గీతాన్ని పాడించాల‌ని కేసీఆర్ అనుకున్నార‌ట‌. అంటే, తెలంగాణ మొత్తం కేసీఆర్ మాట మీద నిల‌బ‌డింద‌ని నిరూపించే ప్ర‌య‌త్న‌మ‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు భావిస్తున్నాయి. అంతేకాదు, జాతీయతావాదంను బీజేపీ పేటెంట్ గా మార్చుకుంటోంది. ఆ విష‌యాన్ని కేసీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌స్తావించారు.

హిందూమ‌తం, జాతీయ‌తావాదం అస్త్రాల‌తో బీజేపీ దేశ వ్యాప్తంగా విస్త‌రించింది. అవే అస్త్రాల‌తో బీజేపీని గ‌ద్దె దించాల‌ని కేసీఆర్ వ్యూహాల‌ను ర‌చించారు. అందుకే, జాతీయ గీతాన్ని ఎంఐఎం అధినేత ఓవైసీతో క‌లిసి మంగ‌ళ‌వారం నాడు ఉద‌యం 11.30 గంట‌ల‌కు వినిపించారు. బీజేపీ మత రాజ‌కీయాల‌ను ఎత్తిచూపుతోన్న కేసీఆర్ జాతీయ‌తావాదం అంద‌రికీ ఉంద‌ని నిరూపించే ప్ర‌య‌త్నం చేశారు. హిందూ మ‌తంలోని వాళ్ల‌కే కాదు ముస్లింల‌కు జాతీయ‌తావాదం ఉంద‌ని నిరూపించే ప్ర‌య‌త్నం అస‌రుద్దీన్ ద్వారా చూపే ప్ర‌య‌త్నం చేశారు. రాబోవు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి కార్య‌క్ర‌మాలను వినూత్నంగా రూపొందించ‌డానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. బీజేపీ అమ్ముల పొదిలోని అస్త్రాల‌ను వాళ్ల వైపు ఎగ్గుపెట్ట‌డానికి మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. ఆ దిశ‌గా స్వాతంత్ర్య దినోత్స‌వం ముగిసిన మరుస‌టి రోజు జాతీయ గీతాలాప‌న అనే అస్త్రాన్ని కేసీఆర్ ఎంచుకున్నార‌ని టీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.