Asaduddin Owaisi: పోటీకి దూరంగా అసదుద్దీన్ ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 2023లో జరగనున్నాయి. ఇటీవలే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. మొదటి జాబితాలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 15 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు

Asaduddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 2023లో జరగనున్నాయి. ఇటీవలే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. మొదటి జాబితాలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 15 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇక బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం త్వరలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఆ పార్టీ అదే ఏడు స్థానాల్లో పోటీ చేస్తుందా లేక రాష్ట్రంలో తన ఉనికిని విస్తరించుకునే ప్రయత్నం చేస్తుందా అనేది సందిగ్ధంగా ఉంది. పార్టీ టిక్కెట్లు దక్కించుకోవడంలో ప్రస్తుత పార్టీ ఎమ్మెల్యేల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికలో ఎంఐఎం ఏడు సీట్లను గెలుచుకుంది. మలక్‌పేట్, బహదూర్‌పురా, నాంపల్లి, యాకుత్‌పురా, చార్మినార్, చాంద్రాయణగుట్ట మరియు కార్వాన్ నియోజకవర్గాలకు ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లోపు పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తుంది.

ఎంఐఎం చీఫ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై స్పష్టత లేదు. ఈ మధ్య ఆయన స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నేను పోటీ చేస్తానో లేదో కూడా నాకు తెలియడం లేదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.దీంతో ఆ పార్టీ ఎజెండా ఏంటో అర్ధం కావడం లేదు. అసదుద్దీన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఢిల్లీ స్థాయిలో తమ పార్టీని తీసుకెళ్లేది ఎవరన్న ప్రశ్న తలెత్తుతుంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్, ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం టిక్కెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.

Also Read: AP : ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై రాష్ట్రపతి సీరియస్