Site icon HashtagU Telugu

Owaisi: గవర్నర్, కేసీఆర్ కుస్తీలోకి ఎంఐఎం అధినేత..!!

Owaisi

Owaisi

తెలంగాణ గవర్నర్ తమిళిసై…ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య గతకొంత కాలంగా విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ…ఢిల్లీ వెళ్లి మరీ పెద్దలకు గవర్నర్ కంప్లైట్ చేశారు. తర్వాత కేసీఆర్ పై భగ్గుమంది. దీనికి టీఆరెస్ మంత్రులు కౌంటర్లు ఇచ్చారు. గవర్నర వైఖరి తెలంగాణ ప్రభుత్వాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉంది. అంతేకాదు గవర్నర్ పరిధిదాటి నడుచుకుంటున్నారని మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఒక గవర్నర్ మాదిరి కాకుండా…రాజకీయనాయకుల్లా ఆమె విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తో కలిసి చేయడం కష్టమని తమిళిసై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

ఇదంతా పక్కన పెడితే…కేసీఆర్ వర్సెస్ గవర్నర్ కుస్తీలోకి ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తలదూర్చారు. ఇది చాలదనట్లు ఆయన మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. తన పీఆర్వోగా బీజేపీ సభ్యుడిని గవర్నర్ నియమించుకోవడాన్ని తప్పుబడుతూ…ట్వీట్ చేశారు. గవర్నర్ చర్య అక్రమమని దుయ్యబట్టారు. ఈ నియామకంతో తెలంగాణ సర్కార్ పై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు రాజకీయంగా ఎన్నో అనుమాలకు కారణం అవుతున్నాయన్నారు. తెలంగాణ సర్కార్ పై గవర్నర్ కుస్తీ అనుమానంగా మారిందన్నారు. పీఆర్వో నియామకంలో వస్తున్న ఆరోపణలపై గవర్నర్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.