Asaduddin Owaisi : కండోమ్స్ ఎక్కువగా ఉపయోగించేది ముస్లింలే – ఓవైసీ

ముస్లీంలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ప్రజలకు ఎందుకు అబద్దం చెబుతున్నారు

  • Written By:
  • Publish Date - April 29, 2024 / 04:00 PM IST

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల ప్రచారం రోజు రోజుకు విమర్శలు , ప్రతివిమర్శలతో కాకరేపుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం లపై మోడీ (Modi) , అమిత్ షా (Amith Sha) చేస్తున్న ఆరోపణలపై దేశ వ్యాప్తంగా ముస్లింలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi).. మోడీ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ మేరకు హైదరాబాద్ పాతబస్తీలో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ముస్లీంలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ప్రజలకు ఎందుకు అబద్దం చెబుతున్నారు. ప్రధాని మోడీ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ముస్లిం జనభా తగ్గిందని.. నిజానికి ముస్లీంలే ఎక్కువగా కండోమ్‌లు వాడుతారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ విషయం చెప్పడంలో సిగ్గుపడడం లేదని అసదుద్దీన్ అన్నారు. ముస్లింలు జనాభా పరంగా మెజార్టీగా మారుతారంటూ ప్రధాని నరేంద్రమోదీ హిందువుల్లో భయాన్ని క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. తమ కమ్యూనిటీపై ఇంకెంతకాలం ఇలాంటి భయాన్ని వ్యాప్తిస్తారని నిలదీశారు. తమ మతం వేరు కావచ్చు కానీ.. తాము ఈ దేశానికి చెందిన వారమేనని స్పష్టం చేశారు. దళితులను, ముస్లీంలను ద్వేషించడమే మోడీ ఎజెండా అంటూ విమర్శించారు.

Read Also : Former MP Kanakamedala Ravindra Kumar : జగన్ కు కనకమేడల సూటి ప్రశ్న