Asaduddin Owaisi Assets: అసదుద్దీన్ ఒవైసీ ఆస్తి వివరాలు.. సొంత కారు లేదట

హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తన ఆస్తి వివరాలను ప్రకటించారు. 2019 లో ప్రకటించిన ఆస్తులు రూ.13 కోట్ల కాగా 2014 సమయానికి రూ. 23.87 కోట్లుగా చూపించారు.

Asaduddin Owaisi Assets: హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తన ఆస్తి వివరాలను ప్రకటించారు. 2019 లో ప్రకటించిన ఆస్తులు రూ.13 కోట్ల కాగా 2014 సమయానికి రూ. 23.87 కోట్లుగా చూపించారు. అతని చరాస్తులు రూ.2.96 కోట్లు మరియు స్థిరాస్తులు రూ.20.91 కోట్లు. విశేషం ఏంటంటే నామినేషన్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు సొంత కారు కూడా లేదు. కాగా ఆయన భార్యకు రూ.15.71 లక్షల విలువైన చరాస్తులు, రూ.4.90 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు అతనికి, అతని భార్యకు 7.05 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

2022-23లో అతని ఆదాయం రూ. 22.03 లక్షలు. అంతకుముందు సంవత్సరంలో రూ. 24.96 లక్షలు. అతని వద్ద లక్ష రూపాయల విలువైన ఎన్‌పి బోర్ .22 పిస్టల్ మరియు ఎన్‌పి బోర్ 30-60 రైఫిల్ ఉన్నట్లు తెలిపారు. ఇంకా వ్యవసాయేతర భూమి లేదా వాణిజ్య భవనాలు లేవని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇంటి మార్కెట్ విలువ సుమారు రూ.19.65 కోట్లు. మిస్రిగంజ్‌లో రూ. 95 లక్షల విలువైన మరో నివాస భవనం ఉంది. ఐదు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. తాను ఎలాంటి క్రిమినల్ నేరానికి పాల్పడలేదని కూడా ప్రకటించాడు.

We’re now on WhatsAppClick to Join

కాగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒవైసి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన వెంట ఆయన కుమారుడు మహమ్మద్ సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా క్వాద్రీ ఉన్నారు.అంతకుముందు చారిత్రాత్మక మక్కా మసీదు నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. మక్కాలో అక్కడ ప్రార్థనలు చేశారు. ఏఐఎంఐఎం మద్దతుదారులు పార్టీ జెండాలు చేతబూని నినాదాలు చేస్తూ చార్మినార్, గుల్జార్ హౌజ్ మీదుగా పాదయాత్ర చేశారు. అసదుద్దీన్ ఒవైసీ తమ్ముడు, తెలంగాణ అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా హాజరయ్యారు. 1984 నుంచి లోక్‌సభకు ఎన్నికవుతున్నారు అసదుద్దీన్. కాగా 119 సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ ఏడు ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంది.

Also Read: DK Aruna: డీకే అరుణ ఆస్తి వివరాలు, భర్తకు 82 వాహనాలు