Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీను చంపుతామంటూ బెదిరింపు కాల్స్

కేవలం 34 శాతమే ఉన్న ముస్లిం జనాభాను 40 శాతం కింద చూపిస్తున్నారని అన్నారు. కేంద్రం తెచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ కుట్రపూరితమని..మోదీ ప్రభుత్వానికి ముస్లింలపై ఉన్న వ్యతిరేకత చూపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు

  • Written By:
  • Publish Date - July 19, 2024 / 03:32 PM IST

అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేసారు. తనను చంపుతామంటూ ఫోన్ కాల్స్ , బెదిరింపు మెసేజ్ (Threatening Calls Messages) లు వస్తున్నాయని ఒవైసీ పేర్కొన్నారు. దీని వెనుక బీజేపీ నేతలు ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మ బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని..తరతరాలుగా వస్తున్న ముస్లిం వివాహ చట్టం రద్దు చేయడమేమిటని ప్రశ్నించారు.

కేవలం 34 శాతమే ఉన్న ముస్లిం జనాభాను 40 శాతం కింద చూపిస్తున్నారని అన్నారు. కేంద్రం తెచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ కుట్రపూరితమని..మోదీ ప్రభుత్వానికి ముస్లింలపై ఉన్న వ్యతిరేకత చూపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఎన్నికల ప్రచారానికి యూపీ వెళ్లినప్పుడు తనపై దుండగులు తొపాకులతో కాల్పులు జరిపారని అన్నారు. ఆ కేసులో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదని..యూపీ ప్రభుత్వం ఆ సంఘటనను చాలా తేలికగా తీసుకుందని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

తాను కేవలం ముస్లింల పక్షానే కాదు దేశ వ్యాప్తంగా బలహీన వర్గాలు, దళితుల పక్షాన మాట్లాటుతున్నానని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో ముస్లింలను బలవంతంగా అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అసదుద్దీన్. దేశంలో మైనారిటీలను చిన్నచూపు చూస్తున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని అన్నారు. తాను ముస్లింల గొంతుకై వారి తరపున ప్రశ్నిస్తున్నందుకే బెదిరింపులు వస్తున్నాయని..దీని వెనుక ఎవరు ఉన్నారో, ఏ శక్తులు ఉన్నాయో త్వరలోనే తెలుస్తుందని అన్నారు.

Read Also : Raviteja : రవితేజ ప్రజల మనిషి.. హిట్ డైరెక్టర్ తో కాంబో ఫిక్స్..!

Follow us