Owaisi: రాహుల్.. దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చెయ్ : ఒవైసీ

టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలను సవాల్ చేసేందుకే తెలంగాణకు వచ్చానంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు.

  • Written By:
  • Publish Date - May 8, 2022 / 06:57 PM IST

టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలను సవాల్ చేసేందుకే తెలంగాణకు వచ్చానంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు.

రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో వయనాడ్ నుంచి కూడా ఓడిపోతారని జోస్యం చెప్పారు. దమ్ముంటే.. హైదరాబాద్ లేదా మెదక్ పార్లమెంటు స్థానాల నుంచి పోటీచేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాహుల్ కు సవాల్ విసిరారు. సరూర్ నగర్ లో ముస్లిం యువతిని పెళ్లాడిన నాగరాజు అనే యువకుడి హత్య ఘటనను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హంతకుల పక్షాన నిలబడేది లేదని స్పష్టం చేశారు. ఇతరుల ప్రాణాలు తీయడం ఇస్లాం ప్రకారం క్షమించరాని నేరమని తెలిపారు.

ఢిల్లీలోని జహంగీర్ పురి, మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ లలో జరిగిన మత అల్లర్లపైనా ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏ మతానికి సంబంధించిన ఊరేగింపులు జరిగినా మసీదులపై హై రేజెల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఊరేగింపులు జరిగేటప్పుడు ఫేస్ బుక్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తే.. రాళ్లు రువ్వేది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుందని అభిప్రాయపడ్డారు.