Owaisi Appeal:క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోండి – అస‌దుద్దీన్‌

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బుధవారం హైదరాబాద్‌లోని ఉచిత కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్‌ను సంద‌ర్శించారు.

  • Written By:
  • Publish Date - November 25, 2021 / 04:33 PM IST

హైదరాబాద్: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బుధవారం హైదరాబాద్‌లోని ఉచిత కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్‌ను సంద‌ర్శించారు. ప్రతి ఒక్కరూ COVID-19 వ్యాక్సిన్‌ను రెండు డోస్‌లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లు క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోక‌పోతే మిమ్మ‌ల్ని మాత్ర‌మే కాకుండా మీ కుటుంబాన్ని కూడా ప్ర‌మాదంలో ప‌డేస్తార‌ని ఓవైసీ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి అన్నారు.18 ఏళ్లు పైబడిన వారు మరియు వృద్ధులు రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. వ్యాక్సినేషన్ మోతాదులను ఇవ్వడానికి ఆశా వర్కర్లు ఇంటికి వస్తున్నారని.. కాబట్టి వారితో మాట్లాడి వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచించారు. టీకా తర్వాత, మీ వివరాలు సరిగ్గా నమోదు చేయబడిందని నిర్ధారించుకోవాల‌ని…తద్వారా 84 రోజుల తర్వాత మీకు తెలియజేసి రెండ‌వ డోస్ ఇస్తారని ఆయ‌న తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో దాదాపు 32,60,000 మందికి మొదటి డోస్, 21,50,821 మందికి రెండవ డోస్ తీసుకున్నార‌ని..రెండు డోస్‌లు తీసుకున్న వారు 40,61757 మంది అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.