Site icon HashtagU Telugu

TS : రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? : కేటీఆర్‌ విమర్శలు

Ktr

As if there is a government in the state..? As if not..? : Criticism of KTR

KTR: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Govt) పై విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రంలో(state) ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అంటూ ప్రశ్నించారు. రైతులు(Farmers) కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, పదేశ్ల బీఆర్‌ఎస్‌ (BRS) పాలనలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు పంపిణి చేశాం. కానీ, కాంగ్రెస్‌ హయాంలో విత్తనాల (seeds) కోసం రైతులు వెతలు పడుతున్నారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది? అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా? బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆగం చేశారు. ఇప్పటికైనా సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి. బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయండని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు.

Read Also: Paytm – Adani : పేటీఎంలో వాటా కొనేయనున్న అదానీ ?