Site icon HashtagU Telugu

TG : ఉత్తమ్ , కోమటి రెడ్డిలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తారు – ధర్మపురి

Aravindh Cong

Aravindh Cong

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) ప్రజలు , ఇతర పార్టీల నేతలు కాదు ఆ పార్టీ నేతలే కూలుస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు నిజామాబాద్‌ బిజెపి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఫై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో బిజెపి సర్కార్ మరోసారి రాబోతుందని..కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో గద్దెనెక్కి మోసగించిందని ధ్వజమెత్తారు. రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని..ఆ పార్టీ నేతలే కూలుస్తారని అరవింద్ అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌ పసుపు బోర్డును తీసుకువచ్చానన్న ఆయన రాష్ట్రం ప్రభుత్వం సహకరిస్తే జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్‌ ఏడాదిలోపు తెరుచుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకున్నందున ప్రజలకు కావాల్సిన పనులు కావడం లేదని విమర్శించారు. అందరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించారని కోరారు.

కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరింది. దేశంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పడిపోతుంది. గుజరాత్‌ మోడల్‌ గురించి సీఎం రేవంత్‌రెడ్డి గొప్పగా చెప్పారు. గుజరాత్‌ మోడల్‌కు రేవంత్‌ రెడ్డి సహకరిస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోతున్నాయి. కేంద్ర పథకాలు అమలు చేయకపోవడం రాష్ట్రానికి నష్టం. కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రాలకు తీరని నష్టం. వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత అమలు చేయరు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోవాలని నేను కోరుకోవట్లేదు. ప్రజలకు నష్టం చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుంది.” అన్నారు.

Read Also : Koppula: వీకెండ్ లో వచ్చి పొయే కాంగ్రెస్, బిజెపిలకు ఓటు వేయొద్దు : కొప్పుల