Site icon HashtagU Telugu

CM Relief Fund : ‘సీఎంఆర్ఎఫ్’ వ్యవహారంలో అరెస్టులు.. హరీశ్‌రావు కార్యాలయం వివరణ

Harish Rao Office Staff

Harish Rao Office Staff

CM Relief Fund : ఎన్నికలు సమీపించిన వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి.  తాజాగా కారు పార్టీకి మరో షాక్ తగిలింది. సీఎం రిలీఫ్‌ ఫండ్స్‌ మంజూరు, చెక్కుల పంపిణీ వ్యవహారంలో  గోల్‌మాల్ జరిగిందంటూ ఒక కేసు రిజిస్టర్ అయింది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆఫీసులో పనిచేసిన సిబ్బంది ఒకరు అరెస్టు కావడం సంచలనంగా మారింది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో హరీశ్‌రావు ఆఫీసులో పనిచేసిన నరేష్‌(CM Relief Fund) కూడా ఉన్నారని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

హరీశ్ రావు కార్యాలయం వివరణ ఇదీ.. 

ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు కార్యాలయం స్పందించింది. ‘‘హరీష్‌ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేశారనే వార్తతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. వాస్తవం ఏమిటంటే నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు వద్ద పీఏ కాదు. అతడు ఒక కంప్యూటర్ ఆపరేటర్‌గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ రావు కార్యాలయంలో పని చేసే వారు. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తైన తర్వాత, ప్రభుత్వ ఆదేశాలు లేఖ నం. 2290 తేదీ 05-12-2023 ఆదేశాల ప్రకారం, ఆ ఆఫీస్‌ను తర్వాత రోజు 06-12-2023 రోజున మూసివేసి సిబ్బందిని పంపేశాం. ఆ రోజు నుంచి నరేష్ అనే వ్యక్తితో హరీశ్ రావు కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు’’ అని పేర్కొంటూ హరీశ్ రావు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read :Sania Mirza – MP Candidate : కాంగ్రెస్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా ?

ఆఫీసును మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను నరేష్ తీసుకువెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందని హరీశ్ రావు కార్యాలయం తెలిపింది.  దీనిపై వెంటనే తాము స్పందించి, నరేష్‌పై 17-12-2023 నాడు నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. నరేష్ అనే వ్యక్తితో హరీశ్ రావుకు కానీ, ఆయన ఆఫీసుకు కానీ సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వాస్తవాలు గుర్తించకుండా తప్పుడు ప్రచారం జరుగుతోందని హరీశ్ రావు కార్యాలయం తెలిపింది. ఒక వ్యక్తి చేసిన తప్పును, మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం సరికాదని పేర్కొంది.

Also Read :INDIA bloc : ఇండియా కూటమిలో చీలిక.. ఆ పార్టీ ఔట్