Site icon HashtagU Telugu

Ganja : సంగారెడ్డిలో 40 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Siddipet Polics

Siddipet Polics

పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా.. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా పెడుతున్నా గంజాయి దందాకు మాత్రం బ్రేకులు పడటం లేదు. పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేకుండా గంజాయి దందా జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖాధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు ముమ్మర దాడులు చేస్తుండటంతో టన్నులకొద్దీ గంజాయి పట్టుబడుతోంది. పోలీసులు జరుపుతున్న దాడుల్లో కళ్లుచెదిరే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన దాడుల్లో 600 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు సూపరింటెండెంట్ ఎం.రమణ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని తుని నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని లాతూర్‌కు సుమారు 600కిలోల ఎండు గంజాయితో వెళ్తున్న లారీని డీఎస్పీ ఎ.బాలాజీ నేతృత్వంలో పోలీసులు తనిఖీ చేసి ఆపివేశారు.

కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ గల లారీని కంది వద్ద ఆపి, సుమారు ₹ 40 లక్షల విలువైన 10 ప్యాకెట్లలో ప్యాక్ చేసిన ఆరు క్వింటాళ్ల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన అనిల్ గోవింద్ కలిముక్లే మరియు డ్రైవర్ గణేష్ నంద కిషోర్ పోతేదార్‌గా గుర్తించారు. ఈ కేసులో నారాయణఖేడ్‌ సమీపంలోని ఎన్‌కెపల్లి గ్రామానికి చెందిన అనిల్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.